అజిత్ సినిమాలో ఆది పినిశెట్టి ముఖ్య పాత్ర పోషించనున్నారా?

Will Ajith play the lead role of Adi Pinchetti in the film?
x

 అజిత్ సినిమాలో ఆది పినిశెట్టి ముఖ్య పాత్ర పోషించనున్నారా?

Highlights

Ajith Movie: *అజిత్ సినిమాలో విలన్ గా మారనున్న ఆది పినిశెట్టి?

Ajith Movie: "సతురంగ వెట్టై" ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమైన హెచ్ వినోద్ ఆ తర్వాత కార్తీ హీరోగా నటించిన "తీరన్ అధిగారం ఒండ్రు" అనే సినిమాతో మరొక హిట్ ని నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా "నెర్కొండ పార్వై", "వలిమై" సినిమాలతో రెండు సూపర్ హిట్ లను అందుకున్నారు హెచ్ వినోద్. తాజాగా ఇప్పుడు మళ్లీ అజిత్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. మొదటి రెండు సినిమాలు మంచి హిట్లు అవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలోని నటీనటుల పేర్లు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి మరియు అజిత్ కలిసి ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే వీరిద్దరూ సినిమాకోసం కలిసారా లేక మామూలుగా కలిసారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు అజిత్ హెచ్ వినోద్ సినిమాలో ఆది పినిశెట్టి మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories