సంక్రాంతికి దూరంగా కొత్తపల్లి గ్రామస్తులు...పండుగ చేస్తే ప్రమాదం జరుగుతుందని...

Village
x
Village
Highlights

సంక్రాంతి పండుగ వస్తుందంటే వారం రోజుల మందు నుంచే పల్లెల్లో సందడి మొదలవుతుంది. రకరకాల పిండివంటలు సిద్ధం చేస్తారు. ఇళ్ల ముందు గొబ్బెమ్మలు, రకరకాల ముగ్గులతో అలంకరిస్తారు.

సంక్రాంతి పండుగ వస్తుందంటే వారం రోజుల మందు నుంచే పల్లెల్లో సందడి మొదలవుతుంది. రకరకాల పిండివంటలు సిద్ధం చేస్తారు. ఇళ్ల ముందు గొబ్బెమ్మలు, రకరకాల ముగ్గులతో అలంకరిస్తారు. ఎక్కడెక్కడున్న వారంతా తమ ఊళ్లకు చేరుకుంటారు. బంధు మిత్రులతో సంతోషంగా పండుగ జరుపుకుంటారు. ఏపీలోని ఓ గ్రామస్థులు మాత్రం సంక్రాంతిని అరిష్టంగా భావిస్తారు. తరతరాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇంతకూ ఆ గ్రామంలో సంక్రాంతి ఎందుకు జరుపుకోరో మనం తెలుసుకుందాం.

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి. కొత్తపల్లి గ్రామం దశాబ్ధాలుగా సంక్రాంతి పండుగ కు దూరంగా ఉంటూ వస్తోంది. అనాధిగా వస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. పండుగ రోజు పూజలు, పిండి వంటల సంగతి దేవుడెరుగు. కనీసం స్నానం కూడా చేయరు ఆ గ్రామస్తులు. దేశ విదేశాల్లో ఉన్న కొత్తపల్లి గ్రామస్తులు కూడా సంక్రాంతి జరుపుకోరు. తరతరాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు.

గతంలో సంక్రాంతి పండుగ సంత తీసుకురావడానికి కొందరు వెళ్లి తిరిగా రాలేదని అప్పటి నుంచి గ్రామంలో పండుగ చేస్తే ప్రమాదం జరుగుతుందని గ్రామస్థుల భయం. అప్పడప్పుడు పండుగ చేసుకోవాలనుకున్న వారికి అనుకోని ప్రమాదాలు జరిగాయని అంటున్నారు. గ్రామానికి చెందిన వారు ఎవరైనా పక్క గ్రామాలకు వెళ్లినా సంక్రాంతి రోజు స్నానం చేయకుండా పండుగకు దూరంగా ఉంటారని చెబుతున్నారు కొత్తపల్లి గ్రామస్థులు.

గ్రామానికి చెందిన యువకులు ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నా అక్కడా తమ ఆచారాన్ని పాటించమని చెబుతామని పండుగ రోజు మాత్రం సంతోషంగా జరుపుకోవద్దని ముందుగానే హెచ్చరిస్తామని చెబుతున్నారు. గ్రామాంలో పండు ముదసలి నుంచి చిన్న పిల్లల వరకూ ఈ ఆచారం పాటిస్తున్నారు. మా గ్రామంలో ఎప్పుడూ సంక్రాంతి పండుగ చేసుకున్న దాఖలాలు లేవంటున్నారు వృద్దులు.

దశాబ్ధాల కిందట ఎప్పుడో ఎదో జరిగిందని అందరిలాగే పండుగ చేసుకుందామని గతంలో కొన్ని సార్లు ప్రయత్నం చేసినా కొత్త బట్టలు కొనుకున్నా ఇబ్బందులు ఎదురయ్యాయని అప్పటి నుంచి యువకులు పండుగ చేసుకోవడానికి ముందుకురారని చెబుతున్నారు. అందరిలాగే గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేసుకోవాలని పండుగ చేసుకోవాలని ఉన్నా గ్రామ కట్టుబాటుతో ఎవరూ సాహసం చేయలేకపోతున్నామని చెబుతున్నారు కొందరు గ్రామస్థులు.

ప్రతి పండుగకూ కొన్ని గ్రామాల్లో ప్రత్యేకతలు ఉంటాయి. స్థానిక ఆచారాలకు అనుగుణంగా రకరకాల పద్దత్తుల్లో పండుగలు చేసుకుంటుంటారు. అస్సలు సంక్రాంతి చేసుకుంటే అరిష్టం జరుగుతుందని నమ్ముతున్న గ్రామస్థుల్లో అవగాహాన కల్పించాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories