ప్రతి పక్ష నేత ఎవరు...ముగ్గురు ముఖ్య నేతల పైరవీలు

Congress
x
Congress
Highlights

ఈ నెల 17 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత ఎవరనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. 19మంది గెలిచినా ప్రధానంగా ముగ్గురు మాత్రం సీఎల్పీ పదవి కోసం అధిష్టానం వద్ద పైరవీలు చేస్తున్నారు.

ఈ నెల 17 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత ఎవరనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. 19మంది గెలిచినా ప్రధానంగా ముగ్గురు మాత్రం సీఎల్పీ పదవి కోసం అధిష్టానం వద్ద పైరవీలు చేస్తున్నారు. ఈ నెల 16 సీఎల్పీ మీటింగ్ ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తుండడంతో నేతలు పైరవీలు ముమ్మరం చేశారు.

రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే సీఎంగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం కూడా చేసారు. ఇక ఎప్పుడు ఎప్పుడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారనే ఉత్కంఠకు తెర పడింది. ఈనెల 17 నుండి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రకటన విడుదల అయ్యింది. ఇక అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే ప్రతిపక్ష నేతను ఎన్నికోవాలి. ఈ నెల 16న సీఎల్పీ సమావేశం ఉండవచ్చని ప్రచారం జరుగుతుండటంతో ఎన్నికైన 19 మందిలో ముగ్గురు సీనియర్ నేతలు సీఎల్పీ పదవికోసం అధిష్టానం వద్ద పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి జరగనున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షనేతను సమావేశాలు జరిగే లోపే ఎన్నిక చేసుకోవడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు పార్టీ ఎవరిని ఎంపిక చేస్తున్నదనేది పార్టీలో ఆసక్తి నెలకొంది. అధిష్టానం సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేఎస్ వేణుగోపాల్ కు అప్పగించింది. ఆయన ఈ నెల 16న ఆయన సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయవచ్చనే చర్చ పార్టీలో జరుగుతుంది.

అందరి ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి అక్కడి నుంచి వచ్చే సీల్డ్ కవర్ పేరును సీఎల్పీ నేత గా ఎంపిక చేస్తారని కాంగ్రెస్ వర్గాలులో చర్చ జరుగుతుంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి , ప్రచారకమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవ్వరికి వారు పైరవీలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. రాహుల్ గాంధీ ఆశీస్సులు ఎవ్వరి పై ఉంటే వారి పేరు సీఎల్పీనేత పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ లో చర్చ జరుగుతుంది. అయితే ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఎవరి పేరు సూచిస్తారనేది పార్టీ లో ఉత్కంఠ రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories