'కారు' దిద్దిన కాపురం ..

కారు దిద్దిన కాపురం ..
x
Highlights

సహజంగా కాపురం అన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి .. అందుకేనేమో సర్దుకుపోతేనే సంసారం అన్నారు పెద్దలు .. అ సమస్యలను కామన్ గా తీసుకుంటే కాపురం అనేది...

సహజంగా కాపురం అన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి .. అందుకేనేమో సర్దుకుపోతేనే సంసారం అన్నారు పెద్దలు .. అ సమస్యలను కామన్ గా తీసుకుంటే కాపురం అనేది నిలబడుతుంది . లేదంటే కాపురాలు విడాకులని కోర్టుమెట్లు ఎక్కాల్సి వస్తుంది . అలాంటి సమస్యే కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రామడుగులో చోటు చేసుకుంది.. ఐదేళ్లు కింద లక్ష్మణ్ మరియు కవిత అనే దంపుతులు చిన్న మనస్పర్థలు వచ్చి విడిపోయారు.. వీళ్ళిద్దరిని కలపడానికి చాలా మంది పెద్ద మనుషులు ప్రయత్నం చేశారు.. కానీ వీరు ఎవరి మాట వినలేదు .. కానీ వీరిని టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈజీ గానే కలిపింది.

రామడుగు మండలంలో ఎంపిటిసి స్థానం ఎస్సి మహిళకు రిజర్వు అయ్యింది.. దానికి పోటీచేసేందుకు పలువురు అభ్యర్థులు టికెట్ ఆశించారు.. ఆ అభ్యర్థుల లిస్టులో లక్ష్మణ్ ఒకరు.. దీనితో లక్ష్మణ్ పేరుని పరిశీలన చేసిన పార్టీ నేతలు ఆయన భార్యతో ఉన్న గొడవలు గురించి అడిగి తెలుసుకున్నారు.. తన తల్లికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటాను అని లక్ష్మణ్ చెప్పడంతో మీ భార్యను తీసుకువస్తే టికెట్ ఇస్తామని నేతలు గట్టిగా చెప్పడంతో లక్ష్మణ్ భార్యను ఒప్పించడానికి అత్తారింటికి దారి పట్టాడు.. భార్య తరుపు బంధువులకు జరిగిన విషయం చెప్పి కవితను కాపురానికి తీసుకువచ్చాడు.. దీనితో టిఆర్ఎస్ నాయకులు ఆమెకు టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు..

అయితే తాజాగా వెలువడిన స్థానిక ఎన్నికల ఫలితాల్లో కవిత తన సమీప అభ్యర్ది అయిన నీరజ ( బీజేపి ) పై 480 ఓట్ల తేడాతో విజయం సాధించింది . ప్రస్తుతం రామడుగు ఎంపీపీ స్థానం కూడా ఎస్సీ రిజర్వుడ్ కావడంతో అధిష్టానం కూడా వారికే అ స్థానాన్ని కట్టబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది . మొత్తం అ మండలంలో 14 ఎంపిటిసి స్థానాలు ఉండడంతో ఇందులో ఆరు టీఆర్ఎస్ కైవసం చేసుకోగా మరో రెండు ఇండిపెండెంట్ అభ్యర్దులు గెలిచారు . వాళ్ళు కూడా తిరిగి టీఆర్ఎస్ గూటికే చేరారు . దీనితో ఏకగ్రీవంగా ఎంపీపీ స్థానం వారికే దక్కే అవకశాలు ఉన్నాయి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories