ఛాన్స్ ఎవరికో..?

ఛాన్స్ ఎవరికో..?
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ నేతల దృష్టి పార్లమెంట్ సీట్లపై పడింది. ఎంపీ సీటు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సొంత...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ నేతల దృష్టి పార్లమెంట్ సీట్లపై పడింది. ఎంపీ సీటు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సొంత పార్టీలోనే ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తు వేస్తూ పోటీకి సిద్ధమవుతున్నారు. మరీ ఓటమి నేతల ఆశలు ఫలిస్తాయా ఆదిలాబాద్ ఎంపీ టికెట్ పై కన్నేసిన నేతల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో.

లోక్‌సభ ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో పోరు మొదలయ్యింది. ఎస్టీ రిజర్వ్ వర్గానికి కేటాయించిన ఆదిలాబాద్ లోక్ సభ స్థానంపై ఆదివాసి ఉద్యమనాయకుడు సోయం బాపురావు, రమేష్ రాథోడ్, నరేష్ జాదవ్ ఆశలు పెట్టుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సోయం బాపురావు బోథ్, రమేష్ రాథోడ్ ఖానాపూర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక నరేష్ జాదవ్ గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

తొమ్మిది లక్షలకు పైగా ఓటర్లు ఉన్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నాలుగు లక్షలకు పైగా ఆదివాసీల ఓట్లు ఉన్నాయి. దీంతో బోథ్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సోయం బాపురావు ఆదివాసి ఉద్యమ నాయకుడిగా తనకు అవకాశం ఇస్తే ఆదివాసీల ఓట్లు గంపగుత్తగా పడుతాయన్న ఆశాభావంతో ఉన్నారు. అంతే కాకుండా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి నగేష్ ను ఓడించాలంటే తనకే అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు సోయం బాపురావు. పార్టీ సమీకరణల్లో తనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఓ అడుగు ముందుకేసి ప్రచారం కూడా మొదలు పెట్టారు సోయం బాపురావు.

ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన రమేష్ రాథోడ్ కూడా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలో ఎంపీగా పని చేశానని చెబుతున్నారు. ఆదీవాసీల ఓట్లు ఎక్కువగా ఉన్నందున లంబాడ వర్గానికి చెందిన రాథోడ్ కు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీలో కొందరు వ్యతిరేకిస్తున్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన నరేష్ జాదవ్ తిరిగి తనకే అవకాశం ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో ఇప్పటికే లాబీయింగ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాపురావు, రమేష్ రాథోడ్ లకు అవకాశం ఇచ్చినందున ఇక తనకే టికెట్ వస్తుందని నరేష్ జాదవ్ ధీమాతో ఉన్నారు. ఆదిలాబాద్ ఎంపి టికేట్ దక్కించుకోవడానికి ముగ్గురు నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories