భానుప్రియను వెంటాడుతున్న చైల్డ్‌ లేబర్‌ కేసు

భానుప్రియను వెంటాడుతున్న చైల్డ్‌ లేబర్‌ కేసు
x
Highlights

సినీనటి భాను ప్రియ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు, చైల్డ్ లేబర్ ను ప్రోత్సహిస్తూ ఆమె ఇంట్లో మైనర్ బాలికలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆమైపై...

సినీనటి భాను ప్రియ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు, చైల్డ్ లేబర్ ను ప్రోత్సహిస్తూ ఆమె ఇంట్లో మైనర్ బాలికలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆమైపై ఫిర్యాదులు వెల్లివెత్తుతున్నాయి. సభ్య సమాజం తల ఎత్తుకునేలా మెసేజ్ ఇవ్వాల్సిన ఓ సినీనటి ఇలా తలదించుకునేలా చిన్నారులతో పని చేయించుకుని ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ ప్రజా సంఘాలు బాలల హక్కుల కమీషన్ భానుప్రియపై మండిపడుతున్నాయి గడచిన పది రోజుల్లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, పెద్దాపురం పోలీస్టేషన్ లలో భానుప్రియపై రెండు ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి.

సినీ నటి భానుప్రియ ఇంట్లో తన మైనర్ కూతురిని నిర్భందించారని గత నెల 23 న తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామానికి చెందిన ప్రభావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది తన కూతురిని తిరిగి తన వద్దకు చేర్చే మార్గం చూపాలంటూ పోలీసులను ఆశ్రయించింది అయితే పోలీసులు కేసు నమోదు చేసేందుకు తటపటాయించడం ఈ వ్యవహారం మీడియాలో ప్రసారం కావడంతో చెన్నైలో భానుప్రియ మీడియాతో మాట్లాడారు. ప్రభావతి మైనర్ కూతురు తన ఇంట్లో పని చేస్తోందని అయితే దొంగతనం చేసిందని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆ బాలికకు అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని మైనర్ బాలిక సంధ్యతోనూ చెప్పించారు అయితే ఈ వ్యవహారం పై బాలల హక్కుల సంఘం, చైల్డ్ లైన్ అధికారులు సీరియస్ కావడం, భానుప్రియ నివాసానికి వెళ్తారనే సమాచారంతో ఈ ఎపిసోడ్ మరో ట్విస్ట్ ఏర్పడింది. తాజాగా భాను ప్రియ నివాసంలో సంధ్యతో పాటు మరో ముగ్గురు మైనర్ బాలికలు పని చేస్తున్నట్టు చైల్డ్ లైన్ అధికారులు గుర్తించారు. ఈ లోగా భానుప్రియ వారిని హుటాహుటిన వారి స్వస్థలాలకు పంపించడంతో ఈ విషయం వెలుగు చూసింది. పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన శైలు, రత్నప్రభతో పాటు మరో బాలికను అదే గ్రామానికి చెందిన నూతాటి సోమరాజు అనే వ్యక్తి భానుప్రియ ఇంట్లో పని చేసేందుకు పంపించినట్టు చైల్డ్ లైన్ అధికారులు గుర్తించారు.

ఈ వ్యవహారంపై స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ ఉండవల్లి గాంధీ బాబు సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంలో ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో ఈ నెల 6న కమిషన్‌కు వివరించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. తక్షణమే భానుప్రియ సహా ఆమె కుటుంబసభ్యులు, మధ్యవర్తి పైనా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై స్వచ్చంధ సేవా సంస్ధలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి తక్షణమే మైనర్ బాలికలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న భానుప్రియ ఆమె కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేయాలని పెద్దాపురం, సామర్లకోట పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేసారు అయితే భానుప్రియ ఈ సారి ఎలా స్పందిస్తారో అనేది మాత్రం వేచి చూడాలి

Show Full Article
Print Article
Next Story
More Stories