Top
logo

మంత్రి పరిటాల సునీతకు డ్వాక్రా మహిళల సెగ!

మంత్రి పరిటాల సునీతకు డ్వాక్రా మహిళల సెగ!
X
Highlights

అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో...

అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో పరిటాల సునీతను అడ్డుకునేందుకు డ్వాక్రా మహిళలు ప్రయత్నించారు. నాలుగేళ్లుగా తమను పట్టించుకోకుండా ఎన్నికల వేళ మాయమాటలు చెప్పేందుకు వస్తున్నారంటూ తిరగబడ్డ మహిళలు. తోపుదుర్తికి సునీత రావొద్దంటూ ఫ్లెక్సీలతో మహిళలు నిరసన తెలిపారు. డ్వాక్రా మహిళలను పోలీసులు బలవంతంగా వాహానాల్లో ఎక్కించి తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. డ్వాక్రా రుణమాఫీ గురించి అడిగితే అరెస్టు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తోపుదుర్తిలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. గ్రామంలోకి రావడానికి రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అడుగడుగున పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

Next Story