ఎమ్మెల్సీ స్థానాల‌కు నేడో రేపో నోటీఫికేష‌న్...అభ్య‌ర్థుల ఎంపిక‌కు గులాబీ బాస్ క‌స‌ర‌త్తు

ఎమ్మెల్సీ స్థానాల‌కు నేడో రేపో నోటీఫికేష‌న్...అభ్య‌ర్థుల ఎంపిక‌కు గులాబీ బాస్  క‌స‌ర‌త్తు
x
Highlights

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల‌కు ఫుల్ కాంపిటీషన్ ఉంది. ఉన్న‌ది 16 ఎమ్మెల్సీ స్థానాలు అయినా 7 సీట్లకే తెగ డిమాండ్ వ‌చ్చి ప‌డింది. ఆశావ‌హులంతా ఆ 7...

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల‌కు ఫుల్ కాంపిటీషన్ ఉంది. ఉన్న‌ది 16 ఎమ్మెల్సీ స్థానాలు అయినా 7 సీట్లకే తెగ డిమాండ్ వ‌చ్చి ప‌డింది. ఆశావ‌హులంతా ఆ 7 ఎమ్మెల్సీ ఖాళీల‌పైనే గురి పెట్టారు. మిగిళిన 9 సీట్ల క‌న్నా ఎమ్మెల్యే కోటాలో సీటు ద‌క్కించుకుంటే ఆ కిక్కే వేర‌ని భావిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసం నేతలంతా తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తెలంగాణలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల‌కు నేడో రేపో నోటీఫికేష‌న్ రాబోతోంది. మార్చ్ 3 నాటికి మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో 7 ఎమ్మెల్యే కోటా, 5 స్థానిక సంస్థ‌ల కోటా, ఉపాధ్యాయుల కోటా2, ప‌ట్ట‌భద్రుల కోటా 1, గ‌వ‌ర్న‌ర్ కోటాలో 1 ఖాళీ అవుతున్నాయి. అయితే ఎమ్మెల్యే కోటాలో ఐదుగురి ప‌ద‌వీ కాలం అయిపోయింది. మిగిళిన ఇద్ద‌రిపై వేటు ప‌డింది. మొత్తం 16 సీట్లున్నా ఎమ్మెల్యే కోటాలోని 7 సీట్ల‌కే భారీగా డిమాండ్ ఏర్ప‌డింది.

ఎమ్మెల్యే కోటా మిన‌హా వేరే ఏ కోటాలో టికెట్ ద‌క్కినా ఎన్నిక‌లు త‌ప్ప‌వు. ఎమ్మెల్యే కోటాలో కూడా ఎన్నిక‌లు జ‌రిగుతాయి. ఒక్కొక్క అభ్య‌ర్థికి 18 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవ‌స‌రం ప‌డ‌తాయి. కాని టీఆర్ ఎస్ కు మొత్తం 90 మంది స‌భ్యుల బ‌లం ఉంది. అయితే టీఆర్ ఎస్ కు 5 సీట్లు ప‌క్కా వ‌స్తాయి. అభ్య‌ర్థుల‌కు ఏ ఎమ్మెల్యే ఓటు వేయాలో సీఎం కేసీఆర్ చూసుకుంటారు. దీంతో ఎమ్మెల్యే కోటాలో అయితే గెలుపు ప‌క్కా అనే గ్యారంటీతో ఏదో ఒక‌టి చేసి ఎమ్మెల్యే కోటాలో టికెట్ ద‌క్కించుకోవాల‌ని ఆశావ‌హులంతా తెగ పోటీ ప‌డుతున్నారు.

ఎమ్మెల్యే కోటా అయితే ఒక్క రూపాయి ఖ‌ర్చు లేకుండా ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉంటుంది. మిగ‌తా గ్రాడ్యువేట్ కోటా, టీచ‌ర్స్‌, ప‌ట్ట‌భ‌ద్రుల కోటాలో టికెట్ వ‌స్తే ఖ‌చ్చితంగా ఖ‌ర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓట‌ర్ల‌కు అంత ఖ‌ర్చు పెట్టినా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రికి ఓటు వేస్తారోన‌న్న టెన్స‌న్ త‌ప్ప‌దు. ఎమ్మెల్యే కోటా అయితే ఖ‌ర్చు త‌ప్పుతుంది టెన్స‌న్ త‌ప్పుతుంది. సో ఆశావ‌హులంతా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌తంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూడా ఖ‌ర్చుతో కూడ‌కున్న‌ వ్యవహారంగా ఉండేది. టీఆర్ ఎస్ వ‌చ్చాక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖ‌ర్చు త‌ప్పింది. దీంతో ఆశావ‌హులంతా మొద‌టి ఆప్ష‌న్ ఎమ్మెల్యే కోటాలోని టికెట్‌నే ఆశిస్తున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌కు గులాబీ బాస్ కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. నోటీఫికేష‌న్ రాగానే అభ్య‌ర్తులంద‌రిని ఒకే సారి ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మిగ‌తాకోటాలోని అభ్య‌ర్థులు ఎవ‌రైనా ఎమ్మెల్యే కోటాలో సీటు ద‌క్కించుకునే అదృష్ట‌వంతులెవ‌నే చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories