తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌ దాదాపు పూర్తి

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌ దాదాపు పూర్తి
x
Highlights

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌ దాదాపు పూర్తయ్యింది. ఇప్పటివరకు టీఆర్ఎస్‌కు చెందిన 90 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎంకు చెందిన...

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌ దాదాపు పూర్తయ్యింది. ఇప్పటివరకు టీఆర్ఎస్‌కు చెందిన 90 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎంకు చెందిన ఏడుగురు, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి ఓటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వేయగా చివరి ఓటు సీఎం కేసీఆర్ వేశారు. ఇరువురు నేతలు శేరి సుభాష్ రెడ్డికే వేశారు. కాంగ్రెస్‌, టీడీపీలు ఓటింగ్‌ను బహిష్కరించినట్టు ప్రకటించడంతో దాదాపు ఓటింగ్‌ ముగిసినట్టే. ఇప్పటివరకు బీజేపీ తన స్టాండ్ ప్రకటించకపోవడంతో ఓటింగ్‌లో పాల్గొనేది లేనిది అనుమానంగా మారింది. మొత్తం 98 ఎమ్మెల్యేల్లో ముగ్గురు అభ్యర్ధులకు 20 మంది చొప్పున తొలి ప్రాధాన్యత ఓటు వేయగా మిగిలిన ఇద్దరు అభ్యర్ధులకు 19 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వేశారు. తాజా పరిణామాల నేపధ్యంలో టీఆర్ఎస్‌తో పాటు ఎంఐఎంకు చెందిన ఐదుగురు అభ్యర్దుల విజయం దాదాపు ఖాయమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories