లోకల్ ..గ్రీన్ సిగ్నల్ ...ఈ నెల 22 నుంచి...

లోకల్ ..గ్రీన్ సిగ్నల్ ...ఈ నెల 22 నుంచి...
x
Highlights

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే వీటిని కూడా నిర్వహించాలని భావించిన కేసీఆర్‌ సర్కారు...

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే వీటిని కూడా నిర్వహించాలని భావించిన కేసీఆర్‌ సర్కారు అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14 మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ప్రతిపాదనలో పేర్కొంది.

లోక్‌సభ ఎన్నికల సమరం ముగియడంతో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల సమయంలోనే పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. దీనికి సీఈసీ కూడా ఆమోదించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ రోజుల్లో నిర్వహించాలనే దానిపై కసరత్తు జరిపింది. ఈ నెల 22 నుంచి మే 14 లోగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది.

రాష్ట్రంలో మొత్తం 535 జడ్పీటీసీలు, 5 వేల 857 ఎంపీటీసీలున్నాయి. వీటి పదవీకాలం వచ్చే జూన్‌లో ముగియనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ ఎన్నికలు కూడా పూర్తి చేసుకుని పాలనపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీంతో ఎన్నికలను సార్వత్రిక ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలోనే నిర్వహించాలని భావించింది. దీనిపై సీఈసీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణ తేదీలను ప్రతిపాదించింది. అయితే వీటి ఫలితాలు మాత్రం లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories