తెలంగాణకు ఆర్థిక సంక్షోభ గండం పొంచి ఉందా..?

తెలంగాణకు ఆర్థిక సంక్షోభ గండం పొంచి ఉందా..?
x
Highlights

తెలంగాణకు ఆర్థిక సంక్షోభ ముప్పు...మిగులు నుంచి టోలు దిశగా పయనం..మరో ఐదు సంవత్సరాల తర్వాత తెలంగాణ ఆర్థిక సంక్షోభం ముంగిట నిలిచే ప్రమాదం ఉందని ప్రభుత్వ...

తెలంగాణకు ఆర్థిక సంక్షోభ ముప్పు...మిగులు నుంచి టోలు దిశగా పయనం..మరో ఐదు సంవత్సరాల తర్వాత తెలంగాణ ఆర్థిక సంక్షోభం ముంగిట నిలిచే ప్రమాదం ఉందని ప్రభుత్వ వర్గాలు లెక్కలు వేశాయి. 2025 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు 2.3 లక్షల కోట్లకు చేరతుందట అప్పటికి రెవెన్యూ వసూళ్లు మాత్రం 1.72 లక్షల కోట్లే ఉంటాయని అంచనా వేశారు. ఆ లోటును పూడ్చుకోవడానికి ఏటా అప్పులు చేసినా 2025 నాటికి తెలంగాణ రెవెన్యూ లోటు 58 వేల కోట్లకు చేరనుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

తెలంగాణ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉన్నా, వచ్చే ఐదేళ్ల కాలానికి ఖర్చులు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. 2025 నాటికి తీవ్ర రెవెన్యూ లోటు ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగిసే నాటికి జమా ఖర్చుల పద్దును బ్యాలెన్స్ చేయడం సవాలుగా మారబోతోందట. ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీత భత్యాలకు కలిపి ఖర్చు 2.30 లక్షల కోట్లకు చేరబోతోంది. రాబడులు మాత్రం అదే స్థాయిలో పెరిగే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు లెక్కలు వేశాయి. 2025 నాటికి రాష్ట్ర స్వీయ పన్నులు, పన్నేతర రాబడి, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, కేంద్ర ప్రభుత్వన్య పథకాల కింద వచ్చే నిధులన్నీ కలిపితే 1.72 లక్షల కోట్ల వరకు మాత్రమే ఉంటాయి. అంటే వ్యయం, రాబడుల మధ్య పూడ్చలేనంత అంతరం ఏర్పడబోతోందని రెండ్రోజుల కిందట తెలంగాణలో పర్యటించిన ఆర్థిక సంఘానికి రాష్ట్ర అధికారులు వివరించారు.

తెలంగాణలో భవిష్యత్‌లో ఏర్పడబోయే రెవెన్యూ లోటు నుంచి బయటపడడానికి అంతగా మార్గాలు లేవని అధికారులు ఆర్థిక సంఘానికి చెప్పారు. విలువైన భూములు గత ప్రభుత్వాలు అమ్మేశాయనీ కొత్తగా ఏర్పడిన రాష్టంలో సరికొత్త ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో నిధులను వెచ్చించాల్సి వస్తోందని వివరించారు. భవిష్యత్తులో సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే కేంద్రం ఆదుకోవడం మినహా మార్గం లేదని విన్నవించారు. ఆర్థిక లోటు నుంచి గట్టెక్కించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేయాలని విన్నవించుకున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories