కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో సీనియర్లు

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో సీనియర్లు
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి భారీ పోటీ నెలకొంది. పార్టీలో సీనియర్లతో పాటు అధిష్టానం నుంచి హామి లభించిన నేతలు పైరవీలు...

తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి భారీ పోటీ నెలకొంది. పార్టీలో సీనియర్లతో పాటు అధిష్టానం నుంచి హామి లభించిన నేతలు పైరవీలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. పార్టీలో సీనియర్లను రంగంలో దించి, అధికారపార్టీకి చెక్ పెట్టాలని పార్టీ యోచిస్తోంది.

ఎమ్మెల్యే కోటలోని ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవం అవుతుందని అది తమ పార్టీ కైవసం చేసుకుంటుందని భావించిన తెలంగాణ కాంగ్రేస్ పార్టీకి, టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి ఐదుగురు అభ్యర్దులకు సరిపోయే ఎమ్మెల్యే సంఖ్య బలం లేకున్నా ఐదో అభ్యర్దిని కూడా రంగంలో దించడానికి రెడీ అవుతుండడంతో హస్తం పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి నలుగురు ఎమ్మెల్సీ అబ్యర్దులను మాత్రమే గెలిపించుకునే అవకాశం ఉంది. అయినా, మరో అభ్యర్దిగా మజ్లీస్ పార్టీకి మద్దతిస్తామని ప్రకటించడంతో అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బలమైన అభ్యర్ది కోసం ప్రయత్నాలు ప్రారంబించింది.

ఇప్పటికే మాజీ మంత్రి మర్రి శశీధర్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల కారణంగా ఆయనుకు టిక్కెట్టు కేటాయించలేదు. ఆయన ఇప్పటకే చంద్రబాబు బేటిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వలని కోరారు. ఇక పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రావుకు ప్రాధాన్యత ఇస్తామని అధిష్టానం హామి ఇవ్వడంతో తనకు ఎట్టి పరిస్థితిలో పార్టీ టిక్కెట్టు వస్తుందని ధీమాతో ఉన్నారు. ఇక ప్రస్తుత మండలి ఫ్లోర్ లీడర్ షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ ఓ సబ్ కమిటీని నియమించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఉపకమిటీని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సోమవారం సమావేశమై సమీక్షించిన తరువాత అభ్యర్ధిని సిఫారసు చేయనుంది. కమిటీలో మాజీమంత్రి శ్రీధర్‌బాబు, వనమా వెంకటేశ్వరరావు, సభితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి, పొడెం వీరయ్య, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్యలు ఉన్నారు. వీరంతా అభిప్రాయాలు సేకరించి అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు.

ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. దీంతో పాటు పొంగులేటి, షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు కూడా రేసులో ఉన్నారు. ఇవాళ్టి సమావేశం లో అభ్యర్థి ఎంపికపై కొంత కొలిక్కివచే అవకాశాలు ఉన్నాయి. అయితే పార్టీ ఎవరిని వైపు మొగ్గుచూపుతోందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories