రూటు మార్చిన తెలంగాణ కమలం పార్టీ...టార్గెట్ 60తో రంగంలోకి...

రూటు మార్చిన తెలంగాణ కమలం పార్టీ...టార్గెట్ 60తో రంగంలోకి...
x
Highlights

నాలుగు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవడంతో బీజేపీ మంచి జోష్ మీదుంది. తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఒక్క స్థానం అధికంగా రావడంతో తామే టీఆర్ఎస్‌కు...

నాలుగు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవడంతో బీజేపీ మంచి జోష్ మీదుంది. తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఒక్క స్థానం అధికంగా రావడంతో తామే టీఆర్ఎస్‌కు ప్రత్యమ్నాయం అంటోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ పాగవేయడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా పనిచేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీ వికసించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటే గెలిచిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఏకంగా నాలుగు స్థానాలు దక్కించుకుని రాజకీయ విశ్లేషకులను ఆశ్యర్యానికి గురిచేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించిన కొత్త వ్యూహం వల్లే బీజేపీకి ఈ విజయం సాధ్యమైనట్టు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ కేవలం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వెల్లింది బీజేపీ. కానీ లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎప్పటిలాగ కాకుండా ఈ సారి రూట్ మార్చింది. టీఆర్ఎస్ పార్టీ పనితీరుపై మండిపడుతూనే ప్రజాకర్షణ ఉన్ననేత మోడీని నమ్ముకుంది. అదే బీజేపీకి కలిసొచ్చింది.

కేంద్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే దక్షిణాదిపై కన్నేసింది బీజేపీ. అప్పటి నుంచి తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రతీ రెండు నెలలకోసారి పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ మరింత బలోపేతం చేశారు. వాళ్లు అంచనా వేసినట్లుగానే ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగేళ్లు సమయం ఉండటంతో తెలంగాణ ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ యోచిస్తోంది. ఇప్పటికే నాలుగు పార్లమెంటు స్థానాల్లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు ఉండటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టార్గెట్ 60తో రంగంలో దిగాలని కమలం పార్టీ యోచిస్తోంది. 1999లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీకి ఇలాంటి సీట్లే వచ్చినా నిలబెట్టుకోలేకపోయింది. ఈ సారి మాత్రం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కమలం పార్టీ సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories