టీటీడీ నుంచి సండ్ర నియామకం రద్దు చేసిన ఏపీ సర్కార్

టీటీడీ నుంచి సండ్ర నియామకం రద్దు చేసిన ఏపీ సర్కార్
x
Highlights

టీటీడీ బోర్డు మెంబర్‌గా సండ్ర వెంకట వీరయ్య నియామకాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో టీటీడీ బోర్డు సభ్యునిగా బాధ్యతలు...

టీటీడీ బోర్డు మెంబర్‌గా సండ్ర వెంకట వీరయ్య నియామకాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో టీటీడీ బోర్డు సభ్యునిగా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. అయితే, రెండు నెలలు గడిచినా సండ్ర, బాధ్యతలు తీసుకోకపోవడంతో ఆయన్ని బాధ్యతల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి కూడా. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలిలో సండ్ర సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా మరోవైపు తెలంగాణ అసెంబ్లీ విస్తరణ నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories