ప్రచారంలో ఫైరింగ్

ప్రచారంలో ఫైరింగ్
x
Highlights

మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి గన్ మెన్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించగా ఓ గన్ మెన్...

మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి గన్ మెన్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించగా ఓ గన్ మెన్ గాల్లో కాల్పులు జరపగా, మరో గన్ మెన్ జరిపిన కాల్పులు మిస్ ఫైర్ అయ్యాయి. ఈ ఘటనలో తిక్కారెడ్డితో పాటు ఏఎస్ ఐ తీవ్రంగా గాయపడ్డారు. గాల్లో కాల్పులు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కగ్గల్లు గ్రామంలో జరిగాయి. టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించబోగా, తిక్కారెడ్డి గన్ మెన్ గాల్లో కాల్పులు జరిపారు.

కగ్గల్లులో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. గ్రామంలో జెండా ఆవిష్కరించిన తర్వాత తిక్కారెడ్డి గ్రామస్తులను టీడీపీలోకి ఆహ్వానిస్తుండగా, వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అనుచరులు. అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో తిక్కారెడ్డి గన్ మెన్ గాల్లో వరుసగా కాల్పులు జరిపారు.

తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నిస్తుండగా ఆయన మరో గన్ మెన్ జరిపిన కాల్పులు మిస్ ఫైర్ అయ్యాయి. లాక్ ఓపెన్ చేస్తూనే గన్ నుంచి బుల్లెట్లు దూసుకువచ్చాయి. దీంతో తిక్కారెడ్డి కాలితో పాటు ఏఎస్ ఐ గోపాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తిక్కారెడ్డిని, ఏఎస్ ఐని జీపులో ఆసుప్రతికి తరలించారు. జీపును వెంబడిస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. గాల్లో కాల్పులు జరుపుతూ ముందుకు సాగారు. ఈ ఘటన తర్వాత వైసీపీ కార్యకర్తలు గ్రామంలో అలజడి సృష్టించారు. దిమ్మకు ఉన్న టీడీపీ జెండాను తీసిపాడేశారు. కగ్గల్లులో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories