Top
logo

మోదీ రాకతో జగన్ ఇంట్లో దాక్కున్నారు: బొండా ఉమ

మోదీ రాకతో జగన్ ఇంట్లో దాక్కున్నారు: బొండా ఉమ
X
Highlights

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ మరోసారి విమర్శనాస్త్రాలను సంధించారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష...

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ మరోసారి విమర్శనాస్త్రాలను సంధించారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి మోదీ రావడంతో జగన్ ఇంట్లో దాక్కున్నారని విమర్శించారు. మోదీతో జగన్ కుమ్మకయ్యారని ఆరోపించారు. మోదీ గుంటూరు సభకు సొంత వాహనాల్లో వైసీపీ కార్యకర్తలను పంపించారన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని ఉమ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తామని ధర్మపోరాట దీక్ష చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారన్నారు. బాబు దీక్షకు తెలంగాణ యువకుల నుంచి కూడా మద్దతు లబిస్తుందన్నారు.

Next Story