టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు

టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు
x
Highlights

తెలుగు సంవత్సరాది... ఉగాది పండుగ పర్వదినాన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెష్టోను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికను...

తెలుగు సంవత్సరాది... ఉగాది పండుగ పర్వదినాన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెష్టోను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికను ప్రకటించారు. తొలుత దుర్గమ్మను దర్శించుకుని మేనిఫెస్టోకు పూజలు చేయించారు. అనంతరం ఉండవల్లి ప్రజావేదికలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. 'మీ భవిష్యత్తు.. నా బాధ్యత' అని మేనిఫెస్టోకు నామకరణం చేశారు.

టీడీపీ మేనిఫెస్టోలో ప్రధానంగా రైతులకు, సామాన్యులకు, మహిళలకు పెద్దపీట వేశారు. మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.

1. అన్నదాతా సుఖీభవ పథకం ఐదేళ్లు అమలు

2. రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం

3. రైతులకు పగటిపూట 12 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా

4. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు

5. రైతులకు లాభసాటి ధరలు లభించేలా వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థల బలోపేతం

6. ప్రకృతి వ్యవసాయం ద్వారా తాజా కూరగాయలు, పండ్లు సరఫరాకు ప్రత్యేక చర్యలు

7. గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా విత్తనాలు, పెట్టుబడి రాయితీలు

8. 50 లక్షల ఎకరాల్లో డ్రిప్‌, స్పింక్లర్‌ వ్యవస్థల ఏర్పాటు

9. కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు

10. యువతకు ఏటా ఉద్యోగాల భర్తీ

11. నిరుద్యోగ భృతిని రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంపు

12. ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

13. ఆదివాసుల కోసం ప్రత్యేక బ్యాంక్‌

14. చంద్రన్నబీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు

15. పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు

16. 20 వేల జనాభా దాటిన మేజర్‌ పంచాయతీల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు

17. పేద కుటుంబాలకు పండుగల నాడు ఉచితంగా రెండు గ్యాస్‌ సిలిండర్లు

18. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పదేళ్లు కొనసాగింపు. రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు.

19. కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ విదేశీ విద్య కోసం రూ.25 లక్షల ఆర్థిక సాయం

20. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ

21. రూ.10 వేల కోట్లతో బీసీల కోసం ప్రత్యేక బ్యాంకు. బీసీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత

22. వృద్ధాప్య పింఛన్‌దారుల అర్హత వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు

23. ప్రతి కుటుంబానికి రూ.20వేలు ఆదాయం కల్పించేలా చర్యలు

24. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పథకం కొనసాగింపు, ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు

25. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కృషి

26. ఏపీని పోషకాహార లోపం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం

27. ప్రీ స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభం

28. గిరిజన ప్రాంతాల్లో గర్భిణులకు హోమ్‌ ఫర్‌ ప్రేగ్నస్ట్‌ ఉమెన్‌ ఏర్పాటు

29. చేనేత కార్మికులకు ఉచిత ఆరోగ్య బీమా

30. అన్ని అగ్ర కులాల్లోని పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

Show Full Article
Print Article
Next Story
More Stories