అధికారమే లక్ష్యంగా టీడీపీ మరిన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం...

అధికారమే లక్ష్యంగా టీడీపీ మరిన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం...
x
Highlights

మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార టీడీపీ మరిన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. అధికారాన్ని శాశ్వతంగా కైవసం చేసుకుంటామని చెబుతున్న సీఎం చంద్రబాబు...

మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార టీడీపీ మరిన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. అధికారాన్ని శాశ్వతంగా కైవసం చేసుకుంటామని చెబుతున్న సీఎం చంద్రబాబు తాజాగా రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోలో మరోసారి ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేసినట్టు సమాచారం. రైతులు, మహిళలు, పేదలు, యువతను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రజాకర్షక పథకాలతో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ మరోసారి సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో గెలుపు ఏకపక్షంగా సొంతం చేసుకోవాలని భావిస్తున్న అధినేత చంద్రబాబు తాజా మేనిఫెస్టోలో అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపించినట్టు సమాచారం. ఐదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలతో 80 శాతం ప్రజల్లో సంతృప్తి ఉందంటున్న చంద్రబాబు తాజాగా మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టారు .

రైతుల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే లక్ష్యంతో అన్నదాత సుఖీభవ పథకాన్ని ఐదేళ్ల పాటు కొనసాగించేలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే సమయంలో పగటి వేళ 12 గంటల ఉచిత విద్యుత్‌,5 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి, 2019 చివరి నాటికి పోలవరం పూర్తి, పంచ నదుల అనుసంధానం వంటి హామీలను ఇచ్చినట్టు తెలుస్తోంది.

తెలంగాణ తరహాలో వృద్ధాప్య పెన్షన్ వయసు 55కు తగ్గింపు, చంద్రన్న బీమా మొత్తం 10 లక్షలకు పెంపు, ప్రతి కుటుంబానికి నెలకు 15 వేల రూపాయలు వచ్చేలా చర్యలు , రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి అన్న క్యాంటీన్లు, అన్ని వర్గాల ప్రజలకు చంద్రన్న పెళ్లి కానుక వర్తింపు వంటి హామీలను ప్రధానంగా ఇవ్వనున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

సామాజిక వర్గాల వారిగా ప్రజలను ప్రసన్నం చేసుకునే దిశగా కాపులకు ఐదేళ్లలో 6 వేల కోట్ల నిధులు, EWS కోటా కింద 5 శాతం రిజర్వేషన్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రెండు విభజించడం, మాదిగలకు ప్రత్యేక కార్పోరేషన్‌, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేలా కేంద్రంపై ఒత్తిడి వంటి హామీలను మేనిఫెస్టోలో ప్రస్తావించనున్నారు

యువతను ప్రోత్సహించే దిశగా రాబోయే ఐదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని హామి ఇవ్వనున్నారు .ఇదే సమయంలో ఐటీలో 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నూతనంగా 20 లక్షల గృహాల నిర్మాణం వంటి హామీలను ఇస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories