Top
logo

సీమ జిల్లాల్లో టీడీపీ వారసుల హవా

సీమ జిల్లాల్లో టీడీపీ వారసుల హవా
X
Highlights

టీడీపీ మొదటి జాబితాలో సీమ జిల్లాల్లో అంతా వారసుల హవానే కనిపించింది. పెద్దలు బరి నుంచి తప్పుకోగా పుత్ర వారసులకు ...

టీడీపీ మొదటి జాబితాలో సీమ జిల్లాల్లో అంతా వారసుల హవానే కనిపించింది. పెద్దలు బరి నుంచి తప్పుకోగా పుత్ర వారసులకు రాచ బాట పరిచారు. అలాగే నిన్న మొన్న టీడీపీ తీర్థం పుచ్చుకున్నవారికీ సీటు దక్కింది.

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సొంత ఇలాకా అయిన కుప్పంనే ఎంచుకున్నారు. మంత్రి ఎన్‌. అమర్‌నాథ్‌రెడ్డి మళ్ళీ పలమనేరు నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి పీలేరు నుంచి తలపడుతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం మరోసారి నందమూరి బాలయ్య రంగంలోకి దిగుతుంటే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీటు మంత్రి అఖిలప్రియకు కేటాయించారు.

సీమ జిల్లాల్లో చాలా మంది వారసులకు సీట్లు ఇచ్చారు. బొజ్జల గోపాలకృష్ణ అసెంబ్లీ బరి నుంచి తప్పుకోగా ఆయన తనయుడు బొజ్జల సుధీర్‌ రెడ్డికి శ్రీకాళహస్తి సీటు కేటాయించారు. దివంగత గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్‌‌కు నగరి సీటు ఇచ్చారు. నగరికి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రతినిధ్యం వహిస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత కోరిన విధంగా ఆ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించలేదు. రాప్తాడు నుంచి సునీతకు బదులు పరిటాల శ్రీరామ్‌కు సీటు ఇచ్చారు. ఇక కర్నూలు జిల్లా పత్తికొండ సీటును డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ, శ్యామ్‌బాబుకు కేటాయించారు. ఇక కర్నూలు జిల్లాలో ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న గౌరు చరితా రెడ్డికి పాణ్యం సీటు, కోట్ల సుజాతమ్మకు ఆలూరు సీటు ఇచ్చారు.

Next Story