టీడీపీ నేతలు హంగామా...డ్రంకన్ డ్రైవ్‌లో వాహనాన్ని సీజ్ చేయడంపై...

టీడీపీ నేతలు హంగామా...డ్రంకన్ డ్రైవ్‌లో వాహనాన్ని సీజ్ చేయడంపై...
x
Highlights

గుంటూరు జిల్లా నకరికల్లులో స్ధానిక టీడీపీ నేతలు రెచ్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీడీపీ నేత తమ్ముడి వాహనాన్ని సీజ్ చేయడంపై భగ్గుమన్నారు. పోలీస్...

గుంటూరు జిల్లా నకరికల్లులో స్ధానిక టీడీపీ నేతలు రెచ్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీడీపీ నేత తమ్ముడి వాహనాన్ని సీజ్ చేయడంపై భగ్గుమన్నారు. పోలీస్ స్టేషన్‌లో నానా రభస స్పష్టించారు. పోలీస్ స్టేషన్‌లోనే ఆందోళనకు దిగి కానిస్టేబుళ్లపై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిరికల్లు ఎస్ఐగా ఉన్న బాస్కర్‌ అద్దంకి - నార్కట్‌పల్లి హైవేపై గత ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న యువకుడిని గుర్తించి వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన వ్యక్తి స్ధానిక టీడీపీ నేత తమ్ముడు కావడంతో పోలీస్ స్టేషన్‌ దగ్గరకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసులను దూషిస్తూ నానా హంగామా స్పష్టించారు. అధికార పార్టీ నాయకులు కావడంతో ఏమి చేయలేక పోయిన పోలీసులు సర్ధి చెప్పి పంపారు. ఎలాంటి తప్పులు చేయకపోయినా సామాన్యులపై లాఠీలు ఝుళిపించే పోలీసులు అధికార పార్టీ నేతల విషయంలో మౌనం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories