Top
logo

టీడీపీ నేతల దౌర్జన్యం

టీడీపీ నేతల దౌర్జన్యం
X
Highlights

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైసీపీలో చేరేందుకు...

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైసీపీలో చేరేందుకు వెళుతున్న వారిని అడ్డుకునేందుకు దాడులకు దిగారు. మండలంలోని వైసీపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలపై రాడ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఆరుగురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. టీడీపీ నేతలు ఓటమి భయంతోనే తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీడీపీ నేతలపై తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిన వెంటనే వైసీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. టీడీపీ నేతల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు.


Next Story