సుజనాకు సీబీఐ నోటీసులు...నేడు బెంగళూరులో విచారణ

సుజనాకు సీబీఐ నోటీసులు...నేడు బెంగళూరులో విచారణ
x
Highlights

సీబీఐ ఎదుట హజరయ్యేందుకు టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఆంధ్రా బ్యాంకు నుంచి 71 కోట్ల రూపాయల రుణం...

సీబీఐ ఎదుట హజరయ్యేందుకు టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఆంధ్రా బ్యాంకు నుంచి 71 కోట్ల రూపాయల రుణం తీసుకుని మోసం చేశారంటూ దాఖలైన కేసులో సుజనా చౌదరి వివరణ ఇవ్వనున్నారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెని లావాదేవీలతో పాటు రుణం తీసుకునేందుకు సమర్పించిన పత్రాలు, రుణ మొత్తాన్ని ఇతర సంస్ధలకు మళ్లించిన తీరుపై సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదే సమయంలో సీబీఐ విచారణలో లభ్యమైన పత్రాల్లో పలు నకిలీవి ఉన్నట్టు గుర్తించారు. వీటితో పాటు ఆంధ్రా బ్యాంకు నుంచి తీసుకున్న నిధులను ఇతర సంస్ధలకు మళ్లించినట్టు గుర్తించిన అనుమానాస్పద లావాదేవీలపై కూడా ప్రశ్నించే అవకాశాలున్నాయి. అయితే బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్ధతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుజనా మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో సుజనా చౌదరిని ప్రశ్నించేందుకు ..ఆర్ధిక వ్యవహారాల్లో అనుభవం కలిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories