120 స్థానాలకు అభ్యర్థులు ఖరారు...ఇవాళ టీడీపీ తొలి జాబితా విడుదల...

120 స్థానాలకు అభ్యర్థులు ఖరారు...ఇవాళ టీడీపీ తొలి జాబితా విడుదల...
x
Highlights

టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. 120 మంది అభ్యర్థుల పేర్లను ఇవాళ సాయంత్రం చంద్రబాబు ప్రకటిస్తారు. ఖరారు కావాల్సిన స్థానాలపై చంద్రబాబు...

టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. 120 మంది అభ్యర్థుల పేర్లను ఇవాళ సాయంత్రం చంద్రబాబు ప్రకటిస్తారు. ఖరారు కావాల్సిన స్థానాలపై చంద్రబాబు ఎడతెరిపిలేని మంతనాలు సాగిస్తున్నారు.

అభ్యర్థుల ఖరారులో దూకుడుగా ఉన్న టీడీపీ ఇవాళ మొదటి విడత జాబితాను విడుదల చేయబోతోంది. 120 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు వారి పేర్లను ప్రకటిస్తారు. ఇవాళ జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలోనూ, ఆ తర్వాత మంత్రులతో జరిగే సమావేశంలో ఫస్ట్ లిస్ట్ గురించి చర్చిస్తారు. ఎందుకు టిక్కెట్లిచ్చాం ఏ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామనే అంశాల గురించి చంద్రబాబు నేతలకు వివరిస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు.

మరోవైపు నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. నరసరావుపేట ఎంపీ సీటు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావుకి ఖరారైందని టీడీపీ వర్గాలు చెప్పగా ఆయన మాత్రం తనకు ఎంపీ సీటుతో పాటు తన కుమారుడికి సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ కావాలని పట్టుపడుతున్నారు. కానీ సత్తెనపల్లి టికెట్ తనకే ఇవ్వాలంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే , స్పీకర్ కోడెల శివప్రసాదరావు డిమాండ్ చేస్తున్నారు. సత్తెనపల్లి సీటు గురించి రాయపాటి, కోడెల పట్టు వీడకపోవడంతో ఇద్దరితో అధినేత చంద్రబాబు చర్చలు జరిపారు. అయితే సత్తెనపల్లి నుంచి రాయపాటి కుమారుడు రంగబాబును బరిలోకి దించి నరసరావుపేట ఎంపీగా కోడెల పోటీ చేయాలని చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం.

ఎల్లుండికి మొత్తం అభ్యర్థుల పేర్ల ప్రకటన ముగించుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల సమర శంఖారావం పూరించబోతున్నారు. 16 నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు. జిల్లాస్థాయి నాయకత్వం మొదలుకుని సేవామిత్రలు, బూత్‌స్థాయి కన్వీనర్ల వరకూ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి, దిశానిర్దేశం చేస్తారు.ఈ పర్యటనలు ముగిశాక ఆయన రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories