గ్రామ పంచాయతీ ఎన్నికలకు గుర్తుల ఖరారు

ec
x
ec
Highlights

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా సర్పంచ్‌, వార్డుమెంబర్లకు కేటాయించే గుర్తులను ఖరారు చేసింది.

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా సర్పంచ్‌, వార్డుమెంబర్లకు కేటాయించే గుర్తులను ఖరారు చేసింది. మొత్తం 50 గుర్తులను ఫైనలైట్‌ చేసిన అధికారులు బ్యాలెట్‌ పేపర్‌లో అభ్యర్థి పేరు ఉండదని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థులకు ఇచ్చే నెంబర్లను మాత్రం ఇంగ్లీష్‌ అక్షరాల క్రమంలో కేటాయిస్తామని తెలిపారు.

మూడు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్, వార్డు మెంబర్ల గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖారారు చేసింది. సర్పంచ్ ఎన్నిక కోసం 30 రకాల గుర్తులను అలాగే వార్డు మెంబర్లకు 20 గుర్తులను ఖరారు చేస్తూ సర్క్యూలర్ విడుదల చేసింది.

ఎన్నికల సంఘం ఖరారు చేసిన గుర్తుల్లో ఒకదానికి ఒకటి ఎక్కడ కూడా పోలిక లేకుండా అధికారులు జాగ్రత్త తీసుకున్నారు. ఓటర్లు ఎక్కడా తికమక పడకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా గుర్తులను ఖారారు చేశారు. ఉంగరం, కత్తెర, బ్యాట్, కప్పు మరియు సాసర్, విమానం, బంతి, షటిల్, కుర్చీ, వంకాయ, నల్ల బోర్డు, కొబ్బరికాయ, లేడీస్‌ పర్సు, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టెబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, క్యారెట్, గొడ్డలి, బిస్కెట్, వేణువు, ఫోర్క్‌, చెంచా ఉన్నాయి.

ఇక వార్డ్ మెంబర్ల కోసం 20 రకాల గుర్తులు ఖరారు చేశారు. జగ్గు, గౌను, గ్యాస్ పొయ్యి ,స్టూల్, గ్యాస్ సిలండర్, గాజు గ్లాస్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటీన, గరాట, మూకుడు, కెటిల్, విల్లు బాణం, పోస్ట్ కవర్, హాకీబ్యాట్‌తో బంతి, నెక్ టై, కటింగ్ ప్లయర్, పోస్ట్ డబ్బా, కరెంట్ స్థంభం గుర్తులను కేటాయించారు. ఇక చివరలో నోటాకు X ( ఇంటూ ) గుర్తును కేటాయించారు.

ఈ గుర్తులతోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకోవాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపర్‌లో మాత్రం బరిలో నిల్చొనే అభ్యర్థి పేరు ఉండదని గతంలోనే ప్రకటించిన ఎన్నికల సంఘం అభ్యర్థులకు కేటాయించే నెంబర్లు మాత్రం వారి వారి పేర్లలోనే మొదటి అక్షరాల ఆధారంగా కేటాయిస్తామని తెలిపారు. నెంబర్‌తో పాటే గుర్తు ఉంటుంది. వార్డు సభ్యుల ఎన్నికలకు గులాబీ రంగు, సర్పంచ్‌ ఎన్నికల కోసం తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్లను వినియోగిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories