కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా సోనియా గాంధీ ఎంపీక ..

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా సోనియా గాంధీ ఎంపీక ..
x
Highlights

ఈరోజు ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకున్నారు. మొదటగా సోనియా పేరును మాజీ...

ఈరోజు ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకున్నారు. మొదటగా సోనియా పేరును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించగా మిగిలిన పార్టీ నేతలంతా ఆమోదం తెలిపారు. 1998 మార్చి 14న కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సోనియా, 2017, డిసెంబర్ 16 వరకూ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు. గత ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించిన ఖర్గే ఈ లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని కలబురిగి లోక్ సభ స్థానంలో తొలిసారి ఓటమి చవిచూశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా కొత్తవారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ రాజీమానా సమర్పించడంతో సోనియా అరంగేట్రం అనివార్యమయింది. ఆమె తర్వాత బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ఇటీవల రాజీనామా సమర్పించారు . అయితే దానిని సీడబ్ల్యూసీ తిరస్కరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories