జాబ్ కాపాడుకునే పనిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

software job
x
software job
Highlights

సాధారణంగా ప్రతి ఏడాది చివరిలో ఐటీ కంపనీలు ఉద్యోగుల పని తీరును చూస్తుంటాయి. అప్రజైర్ పీరియడ్ గా పరిగణిస్తుంటాయి.

పేరుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. లక్షల్లో వేతనాలు పొందుతూ ఎంజాయ్ చేస్తున్న ఐటీ ఉద్యోగుల పరిస్థితి మారింది. ఖర్చులు తగ్గించారు. రోజుకు ఓ గంట సమయం అదనంగా పని చేస్తున్నారు. వీకెండ్ పార్టీలకు గుడ్ బై చెప్పి విధులు నిర్వహిస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా..అవును ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి మారింది. అనూహ్యంగా ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతకు దిగుతున్నాయి. ప్రాజెక్టు వర్క్ ను బట్టి పర్సంటేజ్ ను డిసైడ్ చేసి ఉద్యోగాలు తొలగిస్తుండటంతో జాబ్ కాపాడుకునే పనిలో పడ్డారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.

సాఫ్ట్ వేర్ కంపెనీలు ఐటీ ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాయి. భారీ మొత్త్తంలో వేతనాలు..ప్రతి ఏటా ఇంక్రిమెంట్స్ పొందుతున్న వారికి కోత పెడుతున్నాయి..వీకెండ్ వచ్చిందంటే పబ్బుల్లో పార్టీలు...మల్టీఫ్లెక్స్ లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసిన ఐటీ ఉద్యోగుల పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా.. రోజు అదనంగా ఓ గంట ఎక్కువగా ఆఫీసులోనే గడుపుతున్నారు. ఎప్పుడు ఉద్యోగం నుంచి తీసివేస్తారో అన్న ఆందోళనలో పడిపోయారు.

సాధారణంగా ప్రతి ఏడాది చివరిలో ఐటీ కంపనీలు ఉద్యోగుల పని తీరును చూస్తుంటాయి. అప్రజైర్ పీరియడ్ గా పరిగణిస్తుంటాయి. ప్రధానంగా ఒకటి నుంచి నాలుగు వరకు రేటింగ్ ఇస్తుంటాయి. కానీ ఇప్పుడు అవేవి చూడకుండా నేరుగా ప్రాజెక్టులు లేవంటూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి ఐటీ కంపెనీలు. ఐటీ కంపెనీల తీరుపై సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే గచ్చిబౌలిలో ఓ మహిళా ఐటీ ఉద్యోగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలవరపెడుతుంది.

ఇంక్రిమెంట్స్ లేకున్నా పర్వాలేదు.. ఉద్యోగాల నుంచి తొలగించవద్దంటున్నారు పలువురు ఐటీ ఉద్యోగులు. ఉద్యోగం నుంచి తొలగిస్తే ఏడాది పాటు ఆరోగ్య బీమాతో పాటు ఇతరు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు.

పెద్ద పెద్ద ఐటీ కంపెనీలతో పాటు మధ్య తరహా కంపెనీల్లోనూ ఉద్యోగులను ఇంటికి పంపివేస్తుండటంతో వారి వేతనాలపై పడింది. తమ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగం కోల్పోతే.. తమ పరిస్థితి ఏంటని ఉద్యోగులు దిగులు చెందుతున్నారు. మరో వైపు సెక్స్ వల్ హరాస్ మెంట్ కూడా ఉంటుందని మహిళా ఐటీ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగం నుంచి తొలగించేందుకు సాకులు వెతికే బదులుగా ఉన్నవారిని మరింత మెరుగు పరిచేలా కంపెనీలు చూడాలని కోరుతున్నారు.

ఇయర్ ఎండింగ్ లో వరుసపెట్టి ఐటీ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటనలు చేస్తుండంటో సాఫ్ట్ వేర్ ఉద్యోగులను కలవర పెడుతున్నాయి. కొత్తగా నియామకాలు చేయకపోయినా..నష్టాల తగ్గింపు పేరుతో ఉద్యోగుల తొలగించడం చట్టవిరుద్దమంటున్నారు ఐటీ ఉద్యోగ సంఘాలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories