టీఆర్‌ఎస్‌లో చేరనున్న ఆరుగురు ఎమ్మెల్యేలు?

Congress
x
Congress
Highlights

కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, మాజీ మంత్రి, చేవెళ్ల చెళ్లమ్మగా గుర్తింపు పొందిన సబితా ఇంద్రారెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డితో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, మాజీ మంత్రి, చేవెళ్ల చెళ్లమ్మగా గుర్తింపు పొందిన సబితా ఇంద్రారెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డితో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. సబితకు మంత్రి పదవితో పాటు కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు ఇచ్చేందుకు టీఆర్ఎస్‌ అంగీకరించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి ఇస్తామంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమని సబిత చెప్పినట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షకు సబితా ఇంద్రారెడ్డి హాజరుకాకపోవడం వెనక ఆంతర్యం ఇదేనంటూ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌లు టీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి తరువాత కారు పార్టీలో చేరే యోచనలో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories