సుజనా గ్రూప్స్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వు..

సుజనా గ్రూప్స్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వు..
x
Highlights

సుజనా గ్రూప్స్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పు రిజర్వ్ లో ఉంచింది కోర్టు. జీఎస్టీ అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్...

సుజనా గ్రూప్స్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పు రిజర్వ్ లో ఉంచింది కోర్టు. జీఎస్టీ అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 41 సీఆర్పీ నోటీసులు ఇస్తే వివరణ ఇచ్చే వాళ్లమని సుజనా గ్రూప్స్ డైరెక్టర్లు తెలిపారు. జీఎస్టీ ఆధికారులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. సీఆర్పీ 167 కింద అరెస్ట్ చేసి అధికారం ఉందని జీఎస్టీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. షెల్ కంపెనీ పేరుతో తప్పుడు ఇన్వాయిస్ చూపించి బ్యాంక్ రుణాలు పొంది జీఎస్టీ ఎగవేశారని తెలిపారు. తుది తీర్పు ఇచ్చేంత వరకు సుజనా గ్రూప్స్ డైరెక్టర్లను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories