సెల్ఫిస్టులకో వార్నింగ్‌!! ఈ స్టోరీ చదవండి

సెల్ఫిస్టులకో వార్నింగ్‌!! ఈ స్టోరీ చదవండి
x
Highlights

సెల్ఫీ తీసుకోవడం ఓ రోగమా సెల్ఫీ తీసుకోవడంతో ఆత్మ విశ్వాతం తగ్గిపోతుందా..? ఇది మానసిక సమస్యను పెంచుతుందా..? యువత ఎంతో ఇష్టపడే సెల్ఫీలు వారిని...

సెల్ఫీ తీసుకోవడం ఓ రోగమా సెల్ఫీ తీసుకోవడంతో ఆత్మ విశ్వాతం తగ్గిపోతుందా..? ఇది మానసిక సమస్యను పెంచుతుందా..? యువత ఎంతో ఇష్టపడే సెల్ఫీలు వారిని ప్రమాదంలోకి నెడుతున్నాయా అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు అసలు సెల్ఫీ తెచ్చే ప్రమాదం ఏంటి..? అసలు యువత ఎలాంటి సమస్యలకి దగ్గర అవుతున్నారు.

నిద్ర లేవగానే ఓ సెల్ఫీ డ్రస్ వేసుకున్నాక మరో సెల్ఫీ బాధలో ఉన్నా సెల్ఫీ ఆనందంలో తేలిపోతున్నా సెల్ఫీ ఇలా సందర్భం ఏదైనా సమయం ఎప్పుడైనా ఓ సెల్ఫీ తీసుకుంటే ఆ కిక్కే వేరు అనుకుంటారు చాలా మంది యువత ఇటీవల సెల్ఫీ ట్రెండ్ వైరల్‌లా మారుతోంది. సోషల్ మీడియాలో అయితే రోజుకి రెండు బిలియన్ల ఫోటోస్ పోస్ట్ చేస్తే అందులో అధిక శాతం సెల్ఫీలే ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే ఇక్కడే ఓ ప్రమాదం ఉంది మితిమీరిన సెల్ఫీలు మానసిక స్థితిమీత పెను ప్రభావం పడుతుందని అధ్యనాలు హెచ్చరించాయి. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్..సెల్ఫీ టేకర్లలో అధికంగా 18 నుంచి 24 సంవత్సరాల వారే ఉంటారని వీరు అతిగా సెల్ఫీలు తీసుకోవడం కారణంగా వారిలో ఆత్మన్యూనతా భావం పెరుగుతుందన్నారు. మానసిక సమస్యలకు గురవుతారని, అధిక కోపానికి లోనవుతారని పరిశోదకులు హెచ్చరిస్తున్నారు. ఒకానొక సమయంలో చనిపోయే పరిస్థితులు కూడా వస్తాయని వైద్యులు అంటున్నారు.

సెల్ఫీల విషయంలో యువత ఆలోచన మారాలని డాక్టర్లు చెబుతున్నారు. ప్రత్యేక సమయంలో కాకుండా ప్రతి సందర్భంలోనూ సెల్ఫీలు తీసుకోవడం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. మిగతా ఆరోగ్య సమస్యలగానే సెల్ఫీ సమస్య వారిని కూడా గుర్తించి. వారికి వైద్యం అందించడం అలాగే వారికి తగిన రీతిలో వైద్యం అందించకపోతే వారిలో చాల మార్పులు సమస్యలు వస్తాయన్నారు. మొత్తానికి సెల్ఫీ ట్రెండ్ యువత ఆత్మధైన్యనని దెబ్బతీస్తోంది అందుకే సెల్ఫీలకు కాస్త దూరంగా ఆనందానికి దగ్గరగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories