రెండు సంచలన కేసుల్లో తీర్పును రిజర్వ్‌లో పెట్టిన సుప్రీంకోర్టు

రెండు సంచలన కేసుల్లో తీర్పును రిజర్వ్‌లో పెట్టిన సుప్రీంకోర్టు
x
Highlights

దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం రెండు సంచలన కేసుల్లో తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. రాఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన రివ్యూ...

దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం రెండు సంచలన కేసుల్లో తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. రాఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టగా రాహుల్‌ కోర్టు ధిక్కరణ కేసులో తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

సంచలనం సృష్టించిన రాఫెల్‌ రివ్యూ పిటీషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాడీవేడిగా సాగింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులతో పాటు కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. రాఫెల్‌ ఒప్పందంలో కీలకమైన సమాచారాన్ని కేంద్రం కోర్టుకు ఇవ్వలేదంటూ తొలుత పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా డిసెంబర్ 14 న కోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు. 8 కీలక నిబంధనలను పక్కన పెట్టి రాఫేల్‌కు సంబంధించిన సీసీఎస్‌ సమావేశం నిర్వహించారని ప్రశాంత్‌ భూషణ్‌ చెప్పారు.

రాఫెల్‌ యుద్ధవిమానాలకు సంబంధించిన కీలక పత్రాలు చోరీకి గురయ్యాయన్న కేంద్రం వాదన సరైంది కాదని మరో పిటిషనర్‌ అరుణ్‌ శౌరీ తెలిపారు. ఇప్పటికే కొన్ని పత్రాలు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని చెప్పారు. పత్రికా కథనాలను కోర్టు ఆధారం చేసుకోకూడదని కేంద్రం వాదిస్తోందని అయితే కేంద్రప్రభుత్వం పత్రికలకు ఇచ్చిన సమాచారం ఆధారంగానే గతంలో తీర్పు వచ్చిందంటూ అరుణ్‌ శౌరీ తన వాదనలు వినిపించారు.

చివరగా కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ రాఫెల్ యుద్ధ విమానాలు అలంకారం కోసం కాదని దేశ భద్రత కోసమని అన్నారు. ప్రపంచంలో ఏ కోర్టు కూడా రక్షణ ఒప్పందాలపై విచారణ జరపదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ధరలను బహిర్గతం చేయరాదన్న ఆయన రఫేల్‌ తాజా ఒప్పందం చౌకైందని కాగ్ నివేదిక తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. దాదాపు రెండు గంటల పాటు వాదనలు విన్న ధర్మాసనం లిఖితపూర్వకంగా అభ్యంతరాలను తెలిపేందుకు 15 రోజుల సమయం ఇచ్చింది. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కోర్టు ధిక్కరణ కేసులో కూడా సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. చౌకీదార్‌ చోర్‌ వ్యాఖ్యలపై భే షరతుగా క్షమాపణ చెప్పిన రాహుల్‌గాంధీ తనపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసును కొట్టివేయాలని అభ్యర్థించారు. దీనిపై విచారించిన అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories