Top
logo

ఆమె కోసం తరలివచ్చిన ఇండస్ట్రీ..

ఆమె కోసం తరలివచ్చిన ఇండస్ట్రీ..
X
Highlights

ఆమె ఒకప్పటి తెలుగు నటీ. కన్నడింటి కోడలు సుమలత. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణీ అయిన సుమలత ప్రస్తుతం...

ఆమె ఒకప్పటి తెలుగు నటీ. కన్నడింటి కోడలు సుమలత. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణీ అయిన సుమలత ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల వేళ మాండ్యా లోక్ సభ కు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే కాగా సుమలత ఎన్నికల ప్రచారం కోసం శాండల్ వుడ్ స్టార్లు క్యూ కడుతుండడం విశేషం. ఉన్నారు. అంబరీష్ మరణంతో ఆయన రాజకీయ లోటును భర్తీ చేయడానికి సుమలత ప్రత్యక్ష ఎన్నికల పోటికి వచ్చినట్టుగా సుమలత ప్రకటించింది.

అయితే సుమలతకు పోటీగా ఏకంగా జేడీఎస్‌కు చెందిన కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీచేస్తున్నారు. కాగా ఇప్పటికే సుమలతకు ప్రతిపక్ష బీజేపీ మద్దతునిచ్చింది. ఈ నేపథ్యంలో యాష్ దర్శన్ లాంటి హీరోలు నటీ సుమలతకు మద్దతుగా ఉన్నారు. ప్రచారంలో దూసుకపోతున్నారు. శాండల్ వుడ్ మొత్తం ఆమె కోసం తరలిరావడానికి రెడీ కావడం విశేషం. సుదీప్ కూడా ప్రచారానికి రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ సినీ గ్లామర్ ను, అంబరీష్ మరణంతో వెల్లువెత్తుతున్న సానుభూతిని జేడీఎస్ ఎలా ఎదుర్కొని నిలుస్తుందో! ఎన్నికల బరిలో సుమలత విజయకేతనం ఎగరవేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Next Story