శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా బరితెగింపు..వీఆర్వోలను వెంబడించి...

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా బరితెగింపు..వీఆర్వోలను వెంబడించి...
x
Highlights

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వీఆర్వోలపై ఇసుక దొంగలు దాడికి దిగారు. కర్రలతో మూకుమ్మడిగా అటాక్‌ చేయడంతో...

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వీఆర్వోలపై ఇసుక దొంగలు దాడికి దిగారు. కర్రలతో మూకుమ్మడిగా అటాక్‌ చేయడంతో వీఆర్వోలు చంద్రశేఖర్‌, విశ్వేశ్వర్రావుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి నుంచి మరో ఇద్దరు వీఆర్వోలు, ఒక వీఆర్‌ఏ తృటిలో తప్పించుకున్నారు. తప్పించుకున్న రెవెన్యూ అధికారులు శ్రీకాకుళం రూరల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయపడ్డ వీఆర్వోలను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

శ్రీకాకుళం మండలం నైరా గ్రామంలో కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. స్థానికుల సహకారంతో పొలాల్లో గుట్టలుగుట్టలుగా ఇసుక మేటలు వేశారు. అక్కడ్నుంచి ఇసుకను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. దాంతో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా అధికారులు... ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసింది. దాంతో నాగావళి, వంశధార నదీ తీరాల్లో రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నవారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై ఇసుక మాఫియా రెచ్చిపోయింది. గ్రామస్తుల సహకారంతో వీఆర్వోలపై మూకుమ్మడికి దాడికి దిగారు. ఇసుక మాఫియా దాడిలో ఇద్దరు వీఆర్వోలకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రెవెన్యూ అధికారులపై ఇసుక మాఫియా దాడిపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. తప్పుడు పనులు చేస్తూ, దాడులుచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories