Rule Change from May 1: మే 1 నుంచి కొత్త రూల్స్.. మీ బ్యాంక్, రైల్వే, గ్యాస్ బిల్లులపై ప్రభావం!

Rule Change from May 1: మే 1 నుంచి కొత్త రూల్స్.. మీ బ్యాంక్, రైల్వే, గ్యాస్ బిల్లులపై ప్రభావం!
x

Rule Change from May 1: మే 1 నుంచి కొత్త రూల్స్.. మీ బ్యాంక్, రైల్వే, గ్యాస్ బిల్లులపై ప్రభావం!

Highlights

Rule Change from May 1: రేపటి నుంచి అంటే మే 1, 2025 నుంచి అనేక కీలక మార్పులు చోటు చేసుకోబున్నాయి. ఇవి నేరుగా మన జేబుపై ప్రభావం చూపించనున్నాయి. బ్యాంకు ఖాతా నిబంధనల నుంచి ఏటీఎం లావాదేవీల వరకు, వంటగ్యాస్ ధరల వరకు చాలా విషయాల్లో మార్పులు రాబోతున్నాయి. కాబట్టి, ఈ కొత్త నియమాల గురించి ముందుగానే తెలుసుకుందాం.

ఏటీఎం నుంచి డబ్బు తీయడం ఇకపై మరింత భారం

మే 1, 2025 నుంచి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం మరింత ఖరీదు కాబోతుంది. ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత ప్రతిసారి డబ్బులు తీసినందుకు రూ. 19 చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఈ ఛార్జీ రూ. 17గా ఉండేది. అంతేకాకుండా, మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే కూడా రూ. 7 ఫీజు చెల్లించాలి. ఇదివరకు ఈ ఛార్జీ రూ. 6గా ఉండేది.

రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్

మే 1, 2025 నుంచి రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో కొన్ని మార్పులు రానున్నాయి. ప్రయాణం చేసేవారు ఈ కొత్త విధానానికి అనుగుణంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇకపై వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కేవలం జనరల్ కోచ్‌లో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. స్లీపర్ కోచ్‌లో వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ప్రయాణించడానికి వీలు లేదు. దీనితో పాటు, అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్‌ను 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించారు. అంటే మీరు మీ టికెట్‌ను 60 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

11 రాష్ట్రాల్లో ఒకే RRB పథకం అమలు

మే 1, 2025 నుంచి దేశంలోని 11 రాష్ట్రాల్లో ఒకే రాష్ట్రం ఒక RRB పథకం అమలులోకి రానుంది. దీని అర్థం ఏమిటంటే ప్రతి రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కలిపి ఒక పెద్ద బ్యాంకుగా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల బ్యాంకింగ్ సేవలు మరింత మెరుగుపడతాయి. వినియోగదారులకు మరింత సౌకర్యం లభిస్తుంది. ఈ మార్పు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లలో అమలు చేయనున్నారు.

LPG సిలిండర్ ధరల్లో మార్పు

ప్రతి నెల మొదటి తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తారు. ఈసారి కూడా మే 1న గ్యాస్ సిలిండర్ ధరలపై సమీక్ష ఉంటుంది. ఈ ధర మీ జేబుపై ప్రభావం చూపుతుంది.

FD, సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేట్లలో మార్పు

మే 1 నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేట్లలో కూడా మార్పులు చూడవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెండుసార్లు రెపో రేటును తగ్గించినప్పటి నుండి చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలు, FDలపై వడ్డీ రేట్లను తగ్గించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories