వాద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

వాద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
x
Highlights

యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా అల్లుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఇవాళ మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ...

యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా అల్లుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఇవాళ మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుక్కోబోతున్నారు. కాసేపట్లో రాబర్ట్ వాద్రా డిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటారు. లండన్ లో అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాద్రాను నిన్న ఆరు గంటలపాటు విచారించిన ఈడీ అధికారులు మనీలాండరింగ్, లండన్ అక్రమాస్తులపై ప్రశ్నించారు. 40 ప్రశ్నలకు లిఖితపూర్వకంగా జవాబు రాయించుకున్నారు. ఇవాళ రెండో విడత విచారణ సాగనుంది.

రెండో రోజు విచారణకు హాజరయ్యే ముందు రాబర్ట్ వాద్రా తన ఇంట్లో న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, ప్రముఖ న్యాయవాదులైన కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వితో కూడా మంతనాలు జరిపారు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం. లండన్‌లో అక్రమాస్తులకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల దగ్గర కీలక పత్రాలు ఉన్నాయన్న సమాచారంతో వాద్రా న్యాయ నిఫుణులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు కొద్దిరోజుల కిందటే వాద్రాకు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories