Top
logo

ఆ ప్రచారమంతా అబద్ధం: రేవంత్‌

ఆ ప్రచారమంతా అబద్ధం: రేవంత్‌
X
Highlights

తాను పార్టీ మారుతానని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ...

తాను పార్టీ మారుతానని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తన మీద నమ్మకంతో రాహుల్ గాంధీ టికెట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. వ్యాపారం కోసమే సామాజిక మాధ్యమాల్లో తప్పడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మినీ భారతదేశమైన మల్కాజ్‌గిరిలో తనను ప్రజలు ఆశీర్వదించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిన కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని రేవంత్‌ ఈ సందర్భంగా స్పష్టంచేశారు.

Next Story