వెయ్యి లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగాయట!

liquor
x
liquor
Highlights

సాధరణంగా మనుషులు మధ్యం తాగుతారనే తెలుసు కాని వింతగా ఎలుకలు మధ్యం తాగుతున్నాయట అది కూడా లీటరు రెండు లీటర్లు కాదు ఏకంగా వెయ్యిలీటర్లు మద్యం తాగయట, ఇది నమ్మడానికి వింతగా ఉన్న కాని ఇదే నిజమని ఏకంగా పోలీసులే తెల్చేసారు.

సాధరణంగా మనుషులు మధ్యం తాగుతారనే తెలుసు కాని వింతగా ఎలుకలు మధ్యం తాగుతున్నాయట అది కూడా లీటరు రెండు లీటర్లు కాదు ఏకంగా వెయ్యిలీటర్లు మద్యం తాగయట, ఇది నమ్మడానికి వింతగా ఉన్న కాని ఇదే నిజమని ఏకంగా పోలీసులే తెల్చేసారు. ఇక వివరాల్లోకి వెళితే బరేలీ కంటోన్మేంట్ పోలీసు ఠాణాలో ఈ ఘటన జరిగింది. అక్రమంగా తరలించిన మద్యాన్ని పోలీసులు జప్తుచేసి పోలీసు రాణాలోకి స్టోర్ రూంలో పెట్టారు పోలీసులు. అయితే ఆ స్టోర్ రూంలోకి అనుకొకుండా ఓ పిచ్చికుక్క చేరింది. అది బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన వేరేదారిలేక స్టోర్ రూంలోనే చనిపోయింది. కొన్నిరోజుల తరువాత స్టోర్ నుంచి దుర్వాసరావడంతో పోలీసులు స్టోర్ రూంని తెరిచారు. దింతో స్టోర్ రూంలో ఉన్న మద్యం బాటీళ్లు అన్నీ ఖాళీగా కనిపించాయి. దింతో ఆశ్చర్యపోయారు పోలీసులు.

అయితే ఇదే విషయంపై పోలీస్ హెడ్ క్లర్క్ మాట్లాడుతూ తాను స్టోర్ రూం తెరిచేసరికి మద్యం బాటిళ్లు ఖాళీగా ఉన్నయని కాగా వాటి పక్కనే ఉన్న ఎలుకలు కూడా ఉన్నాయని ఖచ్చితంగా మద్యాన్నీ మొత్తం ఎలుకలే తాగాయని స్పష్టం చేశాడు. అయితే డిపార్ట్ మెంట్ వాళ్లే మద్యంతాగి పైగా ఎలుకలమీద తొస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఓ జువాలజీ ప్రోఫేసర్ మాట్లాడుతూ ఎలుకలకు నీరు దొరకనప్పుడు మాత్రమే మద్యం తాగుతాయని కానీ పోలీసులు చెప్పిన మాటల ప్రకారం చూస్తే ఇంత పెద్ద ఎత్తున మద్యాన్నీ అయితే తాగలేవని స్పష్టం చేశారు. కాగా గతంలోనూ ఇలాంటి ఘటన బిహార్ లో చోటుచేసుకుంది. మద్యం మాయమైందని అప్పుడు కూడా ఇదే తరహాలో ఎలుకలే మద్యం తాగయని ఆరోపించారు.ఈ విషయంపై ఆ ప్రాంత ఎస్పీ అభినందన్ స్పందిస్తూ ఈ ఘటనకు సంబంధించి వెంటనే విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. మాయమైన మద్యంపై పూర్తి వివరాలు చేపట్టి వివరణ ఇవ్వలని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories