Rain Alert: మళ్లీ పుంజుకున్న నైరుతి రుతుపవనాలు – రానున్న 3 రోజులు భారీ వర్షాలు, ఎండలు కూడా వేధించే అవకాశం!

Rain Alert: మళ్లీ పుంజుకున్న నైరుతి రుతుపవనాలు – రానున్న 3 రోజులు భారీ వర్షాలు, ఎండలు కూడా వేధించే అవకాశం!
x

Rain Alert: మళ్లీ పుంజుకున్న నైరుతి రుతుపవనాలు – రానున్న 3 రోజులు భారీ వర్షాలు, ఎండలు కూడా వేధించే అవకాశం!

Highlights

దేశంలోని వాయవ్య ఉత్తరప్రదేశ్‌ నుంచి మధ్యప్రదేశ్‌, దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌, మధ్య ఒడిశా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సాగిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ ప్రభలుతున్నాయి.

Rain Alert: దేశంలోని వాయవ్య ఉత్తరప్రదేశ్‌ నుంచి మధ్యప్రదేశ్‌, దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌, మధ్య ఒడిశా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సాగిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ ప్రభలుతున్నాయి. సుమారు 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద సముద్రమట్టం నుంచి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి కూడా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశలవైపు గాలులు వీస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రానున్న నాలుగు రోజులు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ రోజు తెలంగాణ వర్షాలు కురిసే జిల్లాలు:

జయశంకర్ భూపాలపల్లి

ములుగు

వికారాబాద్

మహబూబ్ నగర్

వనపర్తి

జోగులాంబ గద్వాల్

ఈ జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చు.

ఉష్ణోగ్రతలు ఇలా ఉండే అవకాశం:

గరిష్ట ఉష్ణోగ్రత: ఖమ్మం – 36.4°C

కనిష్ట ఉష్ణోగ్రత: మెదక్ – 29.2°C

నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాలు: ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, భద్రాచలం.

ఏపీలో విభిన్న వాతావరణం కలవరపెడుతోంది:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు ఉక్కపోత ఎండలు ప్రజలను వేధిస్తున్నాయి. వేమవరంలో నిన్న 40°C ఉష్ణోగ్రత నమోదవ్వగా, మన్యం జిల్లాలోని సాలూరులో 43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలు:

విజయనగరం

పార్వతీపురం మన్యం

పశ్చిమ గోదావరి

ఏలూరు

ఎన్టీఆర్

గుంటూరు

పల్నాడు

నెల్లూరు

ఇక్కడ 40-46°C వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.

రానున్న 3 రోజుల వాతావరణ పరిస్థితులు:

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం, రానున్న మూడు రోజులు కింది జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది:

మోస్తారు నుంచి భారీ వర్షాలు: ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి.

తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు.

నిన్న నమోదైన ముఖ్యమైన వర్షపాతం (సాయంత్రం 5 గంటల వరకు):

సాలూరు – 43 మి.మీ.

శ్రీకాకుళం – 42.7 మి.మీ.

ఆనందపురం (విశాఖ) – 37.5 మి.మీ.

జనాలకు హెచ్చరిక:

విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఎండలు, ఉక్కపోత, వర్షాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories