కర్ణాటక నుంచి రాహుల్ గాంధీ పోటీ!

కర్ణాటక నుంచి రాహుల్ గాంధీ పోటీ!
x
Highlights

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎక్కడి నుండి ఎన్నికల బరిలో దిగుతాడని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. అయితే మొత్తానికి రాహుల్...

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎక్కడి నుండి ఎన్నికల బరిలో దిగుతాడని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. అయితే మొత్తానికి రాహుల్ పోటీపై ఉత్కంఠత విడింది. రాహుల్ గాంధీ దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కోరారు. గతంలోనూ ఇందిరాగాంధీ, సోనియాగాంధీ కూడా కర్ణాటక నుంచే పోటీ చేశారని సిద్ధరామయ్య గుర్తుచేశారు. ఈ మేరకు సిద్దరామయ్య శుక్రవారం ట్వీట్టర్ వేదికగా కర్ణాటక ప్రజలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ అధినాయకత్వానికి అండగా ఉన్నారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ విషయంలో కూడా ఇది రుజువైందని రాహుల్‌గాంధీ కూడా కర్ణాటక నుంచి పోటీ చేయాలని కోరుతున్నాం అని సిద్దరామాయ్య పేర్కొన్నారు. మరి దీనిపై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories