ఏదైనా అద్భుతం జరిగితే కానీ ఆయన ప్రధాని కాలేరు: మేనకాగాంధీ

ఏదైనా అద్భుతం జరిగితే కానీ  ఆయన ప్రధాని కాలేరు: మేనకాగాంధీ
x
Highlights

దేశవ్యాప్తంగా తొలి దశ జరిగే ఎన్నికలకు గడువు ముంచుకొస్తుంది. పొలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారంతో దూసుకపోతున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ...

దేశవ్యాప్తంగా తొలి దశ జరిగే ఎన్నికలకు గడువు ముంచుకొస్తుంది. పొలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారంతో దూసుకపోతున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆటకట్టుకునే యత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో సీఎం ఎవరనేది కొన్ని సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలోనే కాబోయే ప్రధానమంత్రి ఎవరుఅనే ఉత్కంఠత అందరిలోనూ ఉంది. అయితే తాజాగా మేనకాగాంధీ రాహుల్ గాంధీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏదైనా అద్భుతం జరిగితే జరిగితే తప్ప కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భారతదేశానికి ఎన్నటికీ ప్రధాని కాలేరని బీజేపీ సీనియర్ నేత, మేనకాగాంధీ అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రభావం ఏ మాత్రం ఉండదని స్పష్టం చేశారు. యూపీలోని సుల్తాన్‌పూర్ నుంచి తాను మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.ఈసారి నేను, మా పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడుతున్నాం. విజయం మాదే అని మేనక చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories