మెగా ఫ్యామిలీలో ఆర్జీవీ చిచ్చు..

మెగా ఫ్యామిలీలో ఆర్జీవీ చిచ్చు..
x
Highlights

సంచలన డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా రామ్ గోపాల్ వర్మ. నిత్యం ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూంటాడు. తాజాగా మోగా ఫ్యామిలీ పై పలు...

సంచలన డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా రామ్ గోపాల్ వర్మ. నిత్యం ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూంటాడు. తాజాగా మోగా ఫ్యామిలీ పై పలు వ్యాఖ్యలు చేశారు. ఇటివలే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం ఒక్కసీటుతో ఒకేఒక్కడుగా నిలిచాడు రాజోలులో రాపాక వరప్రసాద్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఎన్నికల బరిలో దిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో నిన్న విజయవాడలో రాంగోపాల్ వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కంటే మోగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 18రెట్లు నయం అని రాంగోపాల్ వర్మ అన్నారు. ఇక జనసేనతో పోలిస్తే ప్రజారాజ్యం పార్టీ బాహుబలిగా అభివర్ణించారు. ఇక ఈ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో దిగిన నాగబాబు సైతం ఓటమి రూచిచూశారు.

నాగబాబుపై వర్మ మాట్లాడుతూ నాగబాబు ఎక్కడ నుంచి పోటీ చేశారో కూడా తనకు తెలియదన్నారు. గత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ18 సీట్లు సాధించింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి సీఎం అయ్యారు. ఇక వైఎస్ మరణించిన తరువాత పీఆర్పీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తనకు ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదన్న రామ్ గోపాల్ వర్మ ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి తనకు తెలిసిన కారణాలు చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఓటమికి ముఖ్యంగా బాబు వెన్నుపోటు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, అబద్ధాలు చెప్పడం, నారా లోకేష్, జగన్ మోహన్ రెడ్డి ఇవే చంద్రబాబు ఓటమికి కారణాలని ఆర్జీవీ విశ్లేషించారు. అయితే సైకిల్‌ చక్రం పంక్చర్‌ అయ్యిందని, తన నెక్ట్స్‌ సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని వివరించారు డాషింగ్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ.

Show Full Article
Print Article
Next Story
More Stories