మోడీతో ఢీ అంటే ఢీ...ప్రచార సరళిని మార్చిన ప్రియాంక

మోడీతో ఢీ అంటే ఢీ...ప్రచార సరళిని మార్చిన ప్రియాంక
x
Highlights

యూపీలో కాంగ్రెస్, వర్సెస్ బీజేపీ ప్రచార హోరు హోరా హోరీగా సాగుతోంది. మోడీ దేశభక్తి అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే తన తండ్రి మరణం సెంటిమెంట్ ను ప్రయోగించి...

యూపీలో కాంగ్రెస్, వర్సెస్ బీజేపీ ప్రచార హోరు హోరా హోరీగా సాగుతోంది. మోడీ దేశభక్తి అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే తన తండ్రి మరణం సెంటిమెంట్ ను ప్రయోగించి ప్రియాంక ఏకి పారేస్తున్నారు. మరోవైపు రైతులకు ప్రత్యేక బడ్జెట్ పెడతామనీ, మద్దతు ధరలు కల్పిస్తామనీ రాహుల్ హామీ ఇస్తున్నారు మొత్తం మీద ప్రచారంలో అన్ని వైపులనుంచి మోడీకి కౌంటరిస్తోంది కాంగ్రెస్.

2019 సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ రధ సారధులు చెమటోడ్చుతున్నారు. టార్గెట్ తూర్పు యూపీ అంటూ బరిలోకి దిగిన ప్రియాంక తన పదునైన విమర్శలతో మోడీపై దాడి చేస్తున్నారు. ప్రచారంలో తన అన్నకు అడుగడుగునా సహకరిస్తున్నారు. మోడీ పబ్లిసిటీకి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో చెప్పాలంటూ రాహుల్ నిలదీస్తుంటే మోడీ జాతీయవాదాన్ని తూర్పారబడుతున్నారు ప్రియాంక గాంధీ మోడీ అమరులందరినీ గౌరవించడం నేర్చుకోవాలి ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రతిపక్ష నేత తండ్రిని కూడా గౌరవించాలి. ఆయన దేశం కోసం ప్రాణం వదిలారంటూ ఎమోషనల్ గా మాట్లాడారు ప్రియాంక. తండ్రి రాజీవ్ పేరును ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రస్తావించకుండా ప్రియాంక మాట్లాడారు.

ఫతేపూర్ సిక్రీలో కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్ బబ్బర్ కు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ ర్యాలీకి పశ్చిమ యూపీ ఇన్చార్జ్ జ్యోతిరాదిత్య, రాహుల్ కూడా వచ్చారు. బీజేపీ నేతలు తమను తాము జాతీయ వాదులుగా ప్రకటించుకుంటే మతాలకతీతంగా, రాజకీయాలకతీతంగా అందరు అమరవీరులను గౌరవించాలన్నారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన వారిని అగౌరవ పరిచిన వారు జాతీయవాదులు కారని అన్నారు ప్రియాంక. మోడీ తన ప్రసంగాల్లో పదే పదే పాకిస్థాన్ ప్రస్తావన తేవడాన్ని కూడా ప్రియాంక తప్పుబట్టారు. నిజమైన జాతీయ వాదులు దేశం గురించి మాట్లాడతారు పరాయి దేశం గురించి కాదు రైతులు, యువతకు, పేద వర్గాలకు, మహిళలకు ఇప్పటి వరకూ ఏం చేశారో మోడీ చెప్పుకోవాలి వారనుసరిస్తున్న విధానాల గురించి ప్రజలకు వివరించాలి ఇష్టమొచ్చినట్లు వ్యంగ్యంగా మాట్లాడటం కాదు అన్నారు ప్రియాంక. గత ఎన్నికల్లో కూడా మోడీ అమేథిలో రాజీవ్ గాంధీని అవమానించారన్నారు. మోడీ చేస్తున్న నీచ రాజకీయాలను అమేధీ కాంగ్రెస్ కార్యకర్తలు క్షమించరు నా తండ్రిని అవమానించిన గడ్డపై మోడీకి తగిన బుద్ధి చెబుతారన్నారు.

మోడీ ప్రచార తీరును తప్పుబట్టారు రాహుల్. టీవీ, రేడియో, రోడ్లపైనా ఎక్కడ పడితే అక్కడ మోడీ కనిపిస్తున్నారని ఈ పబ్లిసిటీకి సొమ్ము లెక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము ను నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి దోపిడీదారులకు పందేరం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ తెస్తున్న న్యాయ్ పథకం జనం సొమ్ముతో అమలు చేయమని, దానికి అదనపు పన్నులు వసూలు చేయబోమని రాహుల్ అన్నారు. 2019ఎన్నికల్లో గెలిపిస్తే రైల్వే బడ్జెట్ లాగా రైతులకు విడిగా బడ్జెట్ పెడతామన్నారు. కనీస మద్దతు ధరను ప్రతీ ఏటా పెంచుతూ పోతామన్నారు.

మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్లలో ఫుడ్ ప్రోససింగ్ యూనిట్లు పెడతామని రైతులు నేరుగా వారి ఉత్పత్తులు ఫ్యాక్టరీలకే అమ్ముకోవచ్చనీ రాహుల్ అన్నారు. బంగాళా దుంపలు పండే చోట చిప్స్ తయారీ యూనిట్లు, టమాటాలు పండే చోట కెచప్ యూనిట్లు పెడతామన్నారు. ఫతేపూర్ సిక్రీ కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్ బబ్బర్ తనను గెలిపిస్తే ప్రార్ధనాలయాల టూరిజం పెంచుతానని చెప్పారు. మొత్తం మీద అన్నా చెల్లెళ్లు సెంటిమెంట్ పండిస్తూ మోడీని కౌంటర్ చేస్తూ ప్రచారం జోరుగా చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories