ప్రకాష్ రాజ్ కి కాశ్మీర్‌లో చేదు అనుభవం..

ప్రకాష్ రాజ్ కి కాశ్మీర్‌లో చేదు అనుభవం..
x
Highlights

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కి చేదు అనుభవం ఎదురైంది .. ఇటీవల ప్రకాష్ రాజ్ వేసవి విడిది కోసం కాశ్మీర్‌లో పర్యటించారు. అయితే అక్కడ ఎవరో ఒక మహిళ, ఆమె...

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కి చేదు అనుభవం ఎదురైంది .. ఇటీవల ప్రకాష్ రాజ్ వేసవి విడిది కోసం కాశ్మీర్‌లో పర్యటించారు. అయితే అక్కడ ఎవరో ఒక మహిళ, ఆమె కుమార్తెతో కలిసి తనతో ఫొటో దిగేందుకు వచ్చారని, అంతలోనే మోదీ ఫాలోవర్ అయిన ఆమె భర్త వచ్చి నానా యాగి చేశాడని చెప్పారు. తల్లి, కూతుళ్లతో ఫోటో దిగిన తర్వాత అసలు గొడవ మొదలైందని ఆమె భర్త ఆమెతో గొడవకి దిగాడని చెప్పుకొచ్చాడు .. దీనికి కారణం కేవలం నేను ప్రధాన నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడమే కారణమని చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్ .. దీంతో నేను అతడిని పక్కకు తీసుకెళ్లి సముదాయించాను అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

నాకో, మోదీకో కాదు.. మీరు ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు, మీ అందమైన కుమార్తెకు జీవితాన్ని పంచండి. మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. టూర్‌ను ఎంజాయ్ చేయండి అన్నాను. దీంతో అతడు మాట్లాడకుండా ఉండిపోయాడు. అతడు ఫొటోను డిలీట్ చేయొచ్చు.. చేయకపోవచ్చు.. వాళ్ల మనసును మాత్రం గాయపరిచాడు. దీంతో నేను కూడా బరువైన హృదయంతో అక్కడి నుంచి వచ్చేశాను'' అని జరిగిన దానిని వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories