సరికొత్త రికార్డు దిశగా నిజామాబాద్ ఎన్నికలు... దేశంలోనే తొలిసారిగా....

సరికొత్త రికార్డు దిశగా నిజామాబాద్ ఎన్నికలు... దేశంలోనే తొలిసారిగా....
x
Highlights

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు జెడ్ స్పీడ్ తో ఏర్పాట్లు సాగుతున్నాయి. 12 బ్యాలెట్ యూనిట్లుతో దేశంలోనే తొలిసారిగా ఎన్నికలు నిర్వహించి సరికొత్త...

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు జెడ్ స్పీడ్ తో ఏర్పాట్లు సాగుతున్నాయి. 12 బ్యాలెట్ యూనిట్లుతో దేశంలోనే తొలిసారిగా ఎన్నికలు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించాలని ఎన్నికల అధికారులు ఉవ్విళ్లురుతున్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఎం-3 రకం ఈవీఎంలు జిల్లాకు చేరుకున్నాయి.

సరికొత్త రికార్డు దిశగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోనే తొలిసారిగా 12 బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు నిర్వహించేందకు ఈసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యవేక్షణలో నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలింగ్ నిర్వహణకు కావాల్సిన ఎం-3 రకం ఈవీఎంలు వీవీ ప్యాట్లు జిల్లాకు చేరుకున్నాయి. నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించి ఓటింగ్ యంత్రాల పరిశీలన పూర్తి చేసిన అధికారులు మరో రెండు రోజుల పాటు ఓటింగ్ యంత్రాల పరిశీలన కొనసాగుతుందని ప్రకటించారు.

పోలింగ్ బూత్ లో మొత్తం 12 బాలెట్ యూనిట్లను ఎల్ షేపులో ఏర్పాటు చేస్తారు. దీనితో పాటు ఓటర్లు గందరగోళానికి గురికాకుండా 12 బాలెట్ యూనిట్లలో ఉన్న అభ్యర్థుల పేర్లు పోలింగ్ బూత్ బయట ప్రదర్శిస్తారు. దీంతో ఓటర్లు బూత్‌లోకి ప్రవేశించడానికి ముందే తన అభ్యర్థి బాలెట్ యూనిట్ ఏస్థానంలో ఉందో తెలుసుకోవచ్చు. ఇక ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులకు ఈవీఎంల పై అవగాహన కల్పించారు. అయితే బరిలో ఉన్న రైతులు మాత్రం ఇప్పటికీ గుర్తులు కేటాయించలేదని ప్రచారం కోసం వారం పాటు ఎన్నికలు వాయిదా వేయాలని రిటర్నింగ్ అధికారిని కోరారు.

నిజామాబాద్ లోక్ సభ బరిలో ఉన్న రైతులు న్యాయపోరాటం చేసేందుకు హైకోర్టును ఆశ్రయిచారు. అయితే అధికారులు మాత్రం షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు లఘు చిత్రాల ప్రదర్శన, మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కరపత్రాలతో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. ఉదయం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఆయన సమావేశంలో పాల్గొంటారు. ఈవీఎంల లైవ్ డెమోతో పాటు జిల్లా అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories