ఓటు హక్కుపై చైతన్యం పెంచండి...వివిధ రంగాల ప్రముఖులకు ప్రధాని మోదీ పిలుపు

ఓటు హక్కుపై చైతన్యం పెంచండి...వివిధ రంగాల ప్రముఖులకు ప్రధాని మోదీ పిలుపు
x
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌ వేదికగా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఓటింగ్‌ శాతం పెరిగేలా చూడాలని ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ...

ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌ వేదికగా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఓటింగ్‌ శాతం పెరిగేలా చూడాలని ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ నేతలకు, సినీ, క్రీడా రంగాలకు చెందిన స్టార్లకు ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. ఓటర్లను ప్రోత్సహించాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేలా ప్రముఖులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మాయావతి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలందరినీ ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. సినీ రంగం, క్రీడాలోకం ప్రముఖులను కూడా ఉద్దేశిస్తూ పేరుపేరునా ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.

బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, ఆలియా భట్, దీపికా పదుకొణే, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, ప్రస్తుత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్, పీవీ సింధుతో పాటు మరికొందరు ప్రముఖుల ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు ప్రధాని.



Show Full Article
Print Article
Next Story
More Stories