Top
logo

రాఫెల్‌ డీల్‌పై మరోసారి రాహుల్‌ విమర్శలు

రాఫెల్‌ డీల్‌పై మరోసారి రాహుల్‌ విమర్శలు
X
Highlights

రఫెల్‌ డీల్‌పై కాగ్‌ ఇచ్చిన రిపోర్ట్‌పై రాహుల్‌గాంధీ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అసలు ఒప్పందానికి, మోడీ...

రఫెల్‌ డీల్‌పై కాగ్‌ ఇచ్చిన రిపోర్ట్‌పై రాహుల్‌గాంధీ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అసలు ఒప్పందానికి, మోడీ కుదుర్చుకున్న ఒప్పందానికి చాలా తేడా ఉందన్నారు. కాగ్ రిపోర్టులో లెక్కలు తారుమారు అయ్యాయన్న రాహుల్‌గాంధీ రక్షణ కార్యదర్శి నివేదికను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అనిల్‌ అంబానీకి దోచిపెట్టేందుకే రఫెల్ ఒప్పందం జరిగింద్ననారు. రఫెల్ కొనుగోళ్లలో అవకతవకలు జరగపోతే జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయడం లేదన్నారు. రఫెల్ డీల్‌పై జేపీసీ విచారణకు బీజేపీ ఎందుకు భయపడుతోందని రాహుల్‌ ప్రశ్నించారు.

Next Story