పాక్‌పై మరిన్ని దాడులు!

పాక్‌పై మరిన్ని దాడులు!
x
Highlights

పాకిస్థాన్ పై భవిష్యత్‌లో తప్పకుండా మరిన్ని మెరుపుదాడులు జరిగే అవకాశం ఉందంటూ భారత ప్రధాని మోడీ సంకేతాలిచ్చారు. తాజాగా పాక్‌లో జరిగిన దాడులు చివరివి...

పాకిస్థాన్ పై భవిష్యత్‌లో తప్పకుండా మరిన్ని మెరుపుదాడులు జరిగే అవకాశం ఉందంటూ భారత ప్రధాని మోడీ సంకేతాలిచ్చారు. తాజాగా పాక్‌లో జరిగిన దాడులు చివరివి కావని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడిన ముష్కరులు పాతాళంలో ఉన్న కానీ వేంటడి వేటాడి చంపుతామని మోడీ హెచ్చరించారు. పాకిస్తాన్‌ వైమానిక దళాలతో ఘర్షణ సందర్భంగా ఐఏఎఫ్‌ వద్ద రాఫెల్ యుద్ధ విమానాలుంటే బాగుండేదంటూ తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ సమర్థించుకున్నారు. ప్రతిపక్షాలు కాస్త బుర్ర ఉపయోగించాలని ఆయన సూచించారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. భారత్, పాక్ యుద్ధ విమానాలు పరస్పరం దాడులకు దిగినప్పుడు రాఫెల్ వంటి జెట్ విమానం మన దగ్గర ఉంటే మన యుద్ధ విమానం ఒక్కటి కూడా కూలిపోయి ఉండేది కాదని, అదే సమయంలో ప్రత్యర్థుల విమానాల్లో ఒక్కటి కూడా తప్పించుకుని ఉండేది కాదు అన్నారు. రాఫెల్ ఫైటర్ విమానాలు ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదని తాను చేసిన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రతిపక్ష నేతలు కొంచెం కూడా బుర్ర లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గుజరాత్ లోని జామ్ నగర్ లో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య జరిగిన గగనతల పోరాటంలో రాఫెల్ యుద్ధ విమానాలు ఉండుంటే భారత వాయుసేనకు గొప్ప ఆధిక్యం దక్కేదని తాను వ్యాఖ్యానిస్తే మన వాయుసేన సత్తాని ప్రధాని శంకిస్తున్నారంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories