తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ప్రచారం
x
Highlights

సార్వత్రిక సమరం మరింత వేడెక్కింది. ఇప్పటివరకు లోకల్‌ లీడర్ల ప్రసంగాలు హోరెత్తగా ఇక నుంచి జాతీయస్థాయి నేతలు ప్రచారాలు ముమ్మరం కానున్నాయి. ప్రధాని మోడీ...

సార్వత్రిక సమరం మరింత వేడెక్కింది. ఇప్పటివరకు లోకల్‌ లీడర్ల ప్రసంగాలు హోరెత్తగా ఇక నుంచి జాతీయస్థాయి నేతలు ప్రచారాలు ముమ్మరం కానున్నాయి. ప్రధాని మోడీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో రెండు సభల్లో పాల్గొంటారు. విజయ సంకల్ప్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభల కోసం బీజేపీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

తొలివిడతలోనే ఎన్నికలు జరగనున్న తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ప్రచారం చేయనున్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌తో పాటు కర్నూలులో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. కర్నూలులోని STBC కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. SPG భద్రతా దళాలు సభా ప్రాంగణాన్ని తమ అదుపులోకి తీసుకుని బాంబ్ అండ్‌ డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేస్తున్నారు. ఏర్పాట్లను లోకల్‌ లీడర్లు పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ, వైసీపీ రెండూ అవినీతి పార్టీలే అని జనం ఛీ కొడుతున్నారని బీజేపీ నాయకులు విమర్శలకు దిగుతున్నారు. కర్ణాటక సీఎం కుమారస్వామి మాదిరి పవన్‌ సీఎం అవుతారని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఓటమి భయంతో చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటు తెలంగాణలో టీఆర్ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో.. కాంగ్రెస్‌కు షాకుల మీద షాకులు ఇస్తుంటే మధ్యలో అంతో కొంతో లాభపడ్డ బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేయగా ప్రధాని మోడీ కూడా రంగంలోకి దిగారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి డీకే అరుణ పోటీ చేస్తుండగా ఆమెకు మద్దతుగా మోడీ ప్రచారం చేయనున్నారు. పెద్ద ఎత్తున జనసమీకరణ కోసం స్థానిక నాయకులు శ్రమిస్తున్నారు. గెలిచే అవకాశం ఉండటంతో పాటు.. తాము ప్రభావం చూపించేస్థానాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యనేతల ప్రచారంతో మరింత ఊపు తెస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories