జవాన్ శవపేటికతో సెల్ఫీ.. కేంద్ర మంత్రి అల్ఫోన్స్ తీరుపై విమర్శలు

జవాన్ శవపేటికతో సెల్ఫీ.. కేంద్ర మంత్రి అల్ఫోన్స్ తీరుపై విమర్శలు
x
Highlights

కేంద్ర టూరిజం శాఖ మంత్రి అల్ఫోన్స్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడి అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి...

కేంద్ర టూరిజం శాఖ మంత్రి అల్ఫోన్స్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడి అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి అక్కడ శవపేటికతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పెద్ద దుమారం రేగింది. నెటిజన్లు కేంద్ర మంత్రి తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాకు చెందిన వీవీ వసంతకుమార్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహానికి సొంత ఊరిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి వసంతకుమార్ మృతదేహం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. అనంతరం ఆ శవపేటిక వద్ద సెల్ఫీ తీసుకున్నారు. 'సీఆర్పీఎఫ్ జవాన్ అంత్యక్రియలు అతని ఇంటి వద్ద పూర్తయ్యాయి. అలాంటి వారి వల్లే నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను.' అని తన పోస్టుకి క్యాప్షన్ పెట్టారు. అయితే శవపేటికతో సెల్ఫీతీసుకోవడం వివాదం కావడంతో దాన్ని తర్వాత తొలగించారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 40 మందికి పైగా జవాన్లు చనిపోయి దేశం మొత్తం ఆవేదనతో ఉంటే, సెల్ఫీలు తీసుకుంటారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories