logo

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన కుటుంబసభ్యులు

NTR GhatNTR Ghat
Highlights

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 22వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్‌...

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 22వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్‌ దగ్గర నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, సుహాసిని, సినీ దర్శకుడు క్రిష్‌ తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని ఆయన తనయుడు బాలకృష్ణ కొనియాడారు. ఎంతమంది ఎన్ని పార్టీలు పెట్టిన ఎన్టీఆర్ కు సాటివచ్చే వచ్చే నాయకుడు లేడని చెప్పారు. సినిమాల్లో ఎన్టీఆర్ ఏ పాత్ర వేసినా పూర్తిగా న్యాయం చేసేవారని బాలకృష్ణ తెలిపారు.

లైవ్ టీవి

Share it
Top