నిజామాబాద్‌ ఎన్నిక ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్‌

నిజామాబాద్‌ ఎన్నిక ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్‌
x
Highlights

నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం ఎన్నికపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 11న జరిగాల్సిన పోలింగ్‌ను వాయిదా వేయాలంటూ ఎన్నికల బరిలో నిలిచిన రైతులు...

నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం ఎన్నికపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 11న జరిగాల్సిన పోలింగ్‌ను వాయిదా వేయాలంటూ ఎన్నికల బరిలో నిలిచిన రైతులు లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు, అలాగే ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నా ఇంత వరకు గుర్తులు గురించి స్పష్టత ఇవ్వలేదనీ వాటి గురించి ప్రచారం చేసుకోడానికి తగినంత సమయం కూడా లేనందు వల్ల ఎన్నికను వాయిదా వేయాలని పిటిషన్‌లో కోరారు. నిజామాబాద్ రైతులు వేసిన పిటిషన్‌ కాసేపట్లో హైకోర్టు విచారణకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories